ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్.. 6న భువనేశ్వరి శంకుస్థాపన

  • 16వ నంబర్ జాతీయ రహదారిపై భవన నిర్మాణం
  • ఇటీవల ఇక్కడ 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేసిన ట్రస్ట్
  • జీ ప్లస్ 5 విధానంలో అత్యంత అధునాతనంగా నిర్మాణం

విజయవాడలో త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్  ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 6న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భుశనేశ్వరి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భవనం కోసం ఇటీవల 16వ జాతీయ రహదారిపై నున్న ఎల్ఈపీఎల్ మాల్ పక్కన, సాయిబాబా ఆలయ రోడ్డు జంక్షన్‌లో 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో జీప్లస్ 5 విధానంలో అత్యంత అధునాతనంగా భవనాన్ని నిర్మించనున్నారు.  

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విజయవాడ భవనం పూర్తయితే ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇందుకోసం హైదరాబాద్ ట్రస్ట్ భవన్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను విజయవాడ కార్యాలయానికి బదిలీ చేస్తారు. అవసరాన్ని బట్టి స్థానికంగానూ కొందరిని నియమించుకుంటారు.

Related posts

విశాఖ, కడపలో స్థానిక సంస్థల రాజకీయ వేడి…!

Ram Narayana

పులివెందుల‌లో సీఎం జ‌గ‌న్ గెలుపు.. మెజారిటీ ఎంతంటే..!

Ram Narayana

కడప సర్వసభ్య సమావేశంలో మేయర్, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం..!

Ram Narayana