ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వాచ్ మన్ రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు!

  • వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న
  • ఊపిరితిత్తుల వ్యాధితో తన భర్త మరణించాడని రంగన్న భార్య వెల్లడి
  • ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం, రంగన్న మృతిపై మంత్రివర్గంలో చర్చ
  • గతంలో పరిటాల హత్య కేసులోనూ సాక్షులు ఇలాగే మరణిస్తూ వచ్చారన్న చంద్రబాబు

వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. రంగన్న ఊపిరితిత్తుల వ్యాధితో మరణించాడని ఆయన భార్య చెబుతున్నప్పటికీ, పలు వైపుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. 

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ అనంతరం వాచ్ మన్ రంగన్న మృతిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… గతంలో పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇదే విధంగా మరణిస్తూ వచ్చారని… ఇప్పుడు వివేకా హత్య కేసులో అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. 

కాగా, వివేకా హత్య జరిగినప్పుడు జగన్, వైఎస్ భారతిలను కారులో హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడన్న విషయం, వివేకా హత్య గురించి కారులో జగన్, భారతి మాట్లాడుకున్న మాటలను ఆ డ్రైవర్ విన్నాడని, ఆ తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ గతంలో జరిగిన ప్రచారంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. వివేకా వ్యవహారానికి సంబంధించి ఇప్పటిదాకా ఏడుగురు మరణించారని కూడా చర్చ జరిగింది. 

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ… జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను అనేకసార్లు చెబుతున్నానని గుర్తుచేశారు. 

కాగా, వాచ్ మన్ రంగన్న మృతి వెనుక పోలీసుల హస్తం ఉందంటూ వచ్చిన వార్తలపై డీజీపీ స్పందించారు. డీజీపీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రంగన్న మృతిలో అనుమానాలు ఉన్న మాట నిజమేనని, పోలీసుల విచారణలోనూ ఆ విషయం స్పష్టమైందని అన్నారు.

వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షి… ఆయన మృతిపై అనుమానాలున్నాయి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

Kadapa SP Ashok Kumar talks about watchman Ranganna death
  • వివేకా హత్య కేసులో ఐదుగురు సాక్షులు మృతి చెందారన్న ఎస్పీ
  • సాక్షుల మృతిపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
  • సాక్షులు కోరితే వారికి భద్రత కల్పిస్తామని స్పష్టీకరణ 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్ మన్ రంగన్న మరణించడం పట్ల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పందించారు. వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షిగా ఉన్నాడని, ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

వివేకా మర్డర్ కేసులో ఇప్పటిదాకా ఐదుగురు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారని వెల్లడించారు. సాక్షులు శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, వాచ్ మన్ రంగన్న చనిపోయారని వివరించారు. 

సాక్షులు ఎలా చనిపోయారన్న దానిపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ వివరించారు. సిట్ లో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు ఉంటారని తెలిపారు. సాక్షులు మరణించడం వెనుక నిందితుల ప్రమేయం ఉందా అనేది ఆరా తీస్తామని, అన్ని కోణాల్లో విచారిస్తామని అన్నారు. సాంకేతిక నిపుణుల ద్వారా కూడా దర్యాప్తు జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. 

ఈ కేసులో సాక్షులను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని, సాక్షులు కోరితే వారికి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, దస్తగిరిని బెదిరించే కేసులోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Related posts

వర్ల రామయ్యను రాజ్యసభ వరించే అవకాశం …!

Ram Narayana

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది: కేశినేని చిన్ని

Ram Narayana

ఉపముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్ …!

Ram Narayana