హైద్రాబాద్ వార్తలు

విద్యార్థుల నిరసన… హెచ్‌సీయూలో ఉద్రిక్తత!

  • భూముల వేలంపాటను నిలిపివేయాలని విద్యార్థి సంఘాల ఆందోళన
  • అక్రమ వేలాన్ని ఆపేయాలి అంటూ నినాదాలు
  • పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వవిద్యాలయం భూములను అక్రమంగా వేలం వేస్తున్నారని , దీన్ని నిలిపివేయాలని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్రమ వేలం పాటను వెంటనే ఆపేయాలని నినాదాలు చేశారు.

యూనివర్సిటీ క్యాంపస్‌లో మోహరించిన 200 మందికి పైగా పోలీసులు

400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మడానికి ఒప్పుకోము అంటూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తీసుకొచ్చిన యూనివర్సిటీ విద్యార్థులు

విద్యార్థుల నుండి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను లాక్కున్న పోలీసులు

ఎట్టకేలకు పోలీసుల నుండి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ లాక్కొని తగలబెట్టిన విద్యార్థులు

నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ‘పోలీసులు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

Related posts

సర్వీస్ గన్ తాకట్టు పెట్టిన హైదరాబాద్ ఎస్సై.. అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్

Ram Narayana

హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా!

Ram Narayana

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఒకే టికెట్‌తో బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ ప్రయాణం!

Ram Narayana