తెలంగాణ వార్తలు

ఎం పీ వద్దిరాజుకు టియుడబ్ల్యుజె (ఐజెయు) కృతజ్ఞతలు…

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల పున:రుద్దరణపై ఇటివల రాజ్యసభలో గళం విప్పడమే కాకుండా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో చర్చలు జరిపి 50శాతం రాయితీ ను తిరిగి కొనసాగించేవిధంగా క్రషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను సోమవారం ఖమ్మం నగరంలోని ఆయన స్వగ్రహంలో టియుడబ్ల్యుజె (ఐజెయు) ముఖ్య నేతలు కలిసి క్రతజ్ణతలు తెలిపి మెమోంటోతో సత్కరించారు.కరోనా కు ముందు దేశవ్యాప్తంగా అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టులకు రైల్వే ఛార్జీలో యాభైశాతం రాయితీ సౌకర్యం ఉండేది.కరోనా అనంతరం ఈ రాయితీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి రైల్వే పాస్ ల జారీ చేయడాన్ని కూడా నిలిపివేశారు.ఈవిషయంపై టియుడబ్ల్యుజె (ఐజెయు) పలు మార్లు ఎం పి వద్దిరాజు ను కలిసి విన్నవించడం జరిగింది.దీనికి స్పందించిన వద్దిరాజు ఇటివల రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చారు.రాజ్యసభలో ప్రస్తావించడమే కాకుండా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్వీని కుమార్ తో ప్రత్యేకంగా భేటి అయ్యి జర్నలిస్టుల రైల్వే రాయితీ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పారు.రైల్వేలో ప్రయాణించే వారందరికి టిక్కెట్ ధరలో 50శాతం తగ్గించి అందిస్తున్నామని మంత్రి వివరించగా జర్నలిస్టులకు ఆ యాభై శాతంలో మరో 50శాతం రాయితీ కల్పించాలని వద్దిరాజు విపులంగా వివరించగా దానికి కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేశారు.ఈ రాయితీ సౌకర్యాన్ని పున:రుద్దరించేంత వరకు కేంద్రం పై వత్తిడి తీసుకొస్తానని ఈ సందర్బంగా వద్దిరాజు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు . రైల్వే సౌకర్యంతో పాటు జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా తాను ముందు ఉంటానని జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల కోసం తాము కూడా క్రషి చేస్తానని ఈ సందర్బంగా ఆయన హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాంనారాయణ,జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణు గోపాలరావు,ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జ్ ,జిల్లా నాయకులు నల్లజాల వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షులు మైనోద్దిన్,నగర కమిటి అధ్యక్షులు మైసాపాపారావు,కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు….

Related posts

నూకల నరేష్ రెడ్డి బిడ్డ అభినవ్ రెడ్డి ని మీ.. బిడ్డగా ఆశీర్వదించండి .. మంత్రులు తుమ్మల ,పొంగులేటి

Ram Narayana

ఫార్ములా ఈ -కార్ రేసు …కేటీఆర్ పై కేసు నమోదు..!

Ram Narayana

ఓవరాక్షన్ చేయొద్దు: హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక!

Ram Narayana