CM Revanth
తెలంగాణ వార్తలు

జపాన్‌లో రేవంత్ బృందానికి గ్రేట్ డిన్నర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో  ‘తెలంగాణ రైజింగ్’ బృందం జపాన్‌లో పర్యటిస్తోంది. ఈ నెల 16 న మొదలైన ఈ పర్యటన 22 వరకు కొనసాగుతుంది. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ బృందం పర్యటిస్తుంది. ఏప్రిల్ 16న టోక్యో చేరుకున్న తెలంగాణ రైజింగ్ బృందానికి జపాన్‌లోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ శిబు జార్జ్ ఘన స్వాగతం పలికారు. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో బుధవారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ నెపోలియన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యం, సాంస్కృతిక మార్పిడి వంటి అంశాలపై చర్చించారు.

Related posts

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి…

Ram Narayana

ఈ చదువులు నా వల్ల కాదు.. సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఆత్మహత్య…

Ram Narayana

గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టుపట్టింది : మంత్రి పొంగులేటి

Ram Narayana