జాతీయ వార్తలు

బ్రేకింగ్ న్యూస్: గోవాలోని లైరాయిదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి దుర్మరణం!

  • 30 మందికిపైగా గాయాలు
  • క్షతగాత్రులను రెండు ఆసుపత్రులకు తరలించిన అధికారులు
  • ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించిన సీఎం సావంత్

గోవాలోని శ్రిగావ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఇక్కడి శ్రీ లైరాయి దేవి జాతరలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను గోవా మెడికల్ కాలేజీ (జీఎంసీ), మపుసాలోని నార్త్ గోవా జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసుపత్రులను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. తొక్కిసలాటకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతులను గుర్తించాల్సి ఉంది. 

శ్రీ లైరాయి దేవి జాతరను ఏడాదికోసారి నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు గోవా వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తుంటారు. లైరాయిదేవిని పార్వతీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ పండుగలో సంప్రదాయ ‘ధోండాచి’లో భాగంగా వేలాదిమంది భక్తులు పాదరక్షలు లేకుండా మండుతున్న నిప్పులపై నడుస్తారు. వేడుకలో సంప్రదాయ డప్పుచప్పుళ్లు, భక్తిగీతాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరుగుతుంది.  

Related posts

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

Ram Narayana

16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనగడియా నియామకం

Ram Narayana

మిస్సయిన ఆ 26 మంది అమ్మాయిల గుర్తింపు.. ఇద్దరు అధికారులు సస్పెండ్

Ram Narayana