landmine explosion in mulugu
తెలంగాణ వార్తలు

ములుగులో పేలిన మందు పాతర … ముగ్గురు పోలీసులు దుర్మరణం

ములుగు జిల్లా వెంకటాపురం మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం మందుపాతర పేలుడు సంభవించింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తుండగా మందు పాతర పేలింది. ఈ పేలుడులో ముగ్గురు పోలీసులు దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. ఆపరేషన్  కర్రెగుట్ట పేరుతో 17 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 200 మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్రెగుట్ట ప్రాంతంలో జరిగిన ఒక పెద్ద ఎన్‌కౌంటర్ తర్వాత ఈ ఘటన జరిగింది.

Related posts

ఇరాన్ దాడిలో తెలంగాణ వాసికి గాయాలు…

Ram Narayana

చెరకు టన్ను కు రూ 1000 బోనస్ అందించాలి…!

Ram Narayana

ఫీజు రీయింబర్స్ మెంట్ పై కాలేజీల యాజమాన్యాల గగ్గోలు …ఫార్మసీ కాలేజీల మూత!

Ram Narayana