దేశ భద్రత, రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే మూడు సైనిక దళాలైన సైనిక, నౌకాదళ, వాయు రక్షణ సేవల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. రాజస్థాన్, పంజాబ్ ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి, రెండు రాష్ట్రాల సరిహద్దు పరిస్థితిని సమీక్షించారు. కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఏ కార్యక్రమంలోనైనా లేదా కార్యక్రమంలోనైనా బాణసంచా , డ్రోన్ల వాడకంపై నిషేధం విధించింది.

భారత్, -పాకిస్థాన్ మధ్య మళ్లీ భీకర యుద్ధం
కాగా, భారత్, -పాకిస్థాన్ మధ్య మళ్లీ భీకర యుద్ధం జరుగుతోంది. దీన్ని ఎవరూ కోరుకోకపోయినా.. ఈ యుద్ధం వచ్చేందుకు పాకిస్థాన్ కారణం అయ్యింది. రాత్రి నుంచి రెండు దేశాల మధ్య ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. పాకిస్థాన్ ఇండియాలోని 15 నగరాల్లో దాడులు చేస్తుంటే, భారత్, పాక్ లోని 9 నగరాల్లో దాడులు చేస్తోంది. పాకిస్థాన్ 50కి పైగా డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. ఐతే.. భారత్ దగ్గర S400 అనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టం ఉంది. అందువల్ల దీని ద్వారా భారత్.. పాకిస్థాన్ నుంచి వస్తున్న మిస్సైళ్లను అడ్డుకుంటోంది. అలాగే.. డ్రోన్లను కూడా అడ్డుకొని నాశనం చేస్తోంది. అందువల్ల పాకిస్థాన్ ఏమీ చెయ్యలేని పరిస్థితి ఉంది. ఇప్పటివరకూ ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదనీ, ఎక్కడా ఆస్తి నష్టం జరగలేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. భారత్ చేస్తున్న దాడులతో పాకిస్థాన్ ఉలిక్కి పడింది. ముఖ్యంగా పాక్ రాజధాని ఇస్లామాబాదులో జరిపిన దాడులతో.. అక్కడి సైన్యం అలర్ట్ అయ్యింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ని సురక్షిత ప్రాంతంలోకి తీసుకుపోయింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ఉంది. పాక్‌కి సహాయంగా టర్కీ నుంచి ఒక యుద్ధ నౌక వస్తుంటే.. భారత్ 20 యుద్ధ నౌకలను రంగంలోకి దింపుతోంది. అందువల్ల ఏ విధంగానూ పాకిస్థాన్ భారత్‌తో పెట్టుకునే పరిస్థితి లేదు. పాకిస్థాన్ ప్రధానంగా.. జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. ఆ రాష్ట్రాల్లోని నగరాల్లో డ్రోన్లతో దాడులకు యత్నించింది. ఐతే.. ప్రతీ ద్రోణినీ కూల్చేసిన ఆర్మీ.. భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో.. ఎక్కడా తగ్గేది లేదని తెలిపింది. పాకిస్థాన్.. హమాస్ తరహాలో దాడులు చేస్తోందనే అంచనాలు ఉన్నాయి. లాహోర్, హెషావర్ సహా.. కీలక నగరాల్లో భారత దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సరిహద్దుల్లో ఉండే లాహోర్‌కి ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో తాము జోక్యం చేసుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. రెండు అణ్వాయుధ దేశాలు కాబట్టి.. త్వరగానే రెండు దేశాలూ.. యుద్ధానికి ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. మరోవైపు తాను మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

ఇప్పటివరకూ జరిగింది ఇదే …
- భారత్ PoKలో దాడి చేశాక.. పాక్.. భారత సరిహద్దు గ్రామాలపై దాడి చేసి, మన 13 మంది పౌరులను చంపింది.
- బదులుగా భారత్.. లాహోర్‌లో బాంబు పేలుళ్లు జరిపి, పాకిస్థాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
- రెచ్చిపోయిన పాక్, రాత్రి నుంచి ఇండియాలోని 15 నగరాలపై దాడులకు యత్నించింది.
- ఇండియా కూడా పాక్ లోని 9 నగరాలపై దాడులు చేస్తోంది. పాక్ ప్రధాని అజ్ఞాతంలోకి పోయాడు.
- పాకిస్థాన్ దాడులన్నీ జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లోనే జరుగుతున్నాయి.
- ఇప్పటివరకూ పాకిస్థాన్ ప్రతీ దాడినీ భారత్ అడ్డుకుంటోంది. ఒక్క దాడిలోనూ పాక్ సక్సెస్ అవ్వలేదు.
- ఇండియాలోని మిగతా నగరాల్లో హై అలర్ట్ ఉంది. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
- ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రాల సీఎంలు అంతా గమనిస్తున్నారు.