Rajnath Singh
జాతీయ వార్తలు

ట్రైలర్‌ మాత్రమే చూశారు.. సినిమా ముందుంది : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ (Rajnath Singh) సింగ్‌ అన్నారు. ఈ ఆపరేషన్‌తో ట్రైలర్‌ (trailer) మాత్రమే చూశారని.. సినిమా ముందుందని తీవ్రంగా హెచ్చరించారు. భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌ను ఇవాళ రాజ్‌నాథ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్‌ వారియర్స్‌ (Air Warriors)తో సంభాషించారు. అనంతరం అక్కడ ప్రసంగించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదు. ఇప్పటి వరకూ ఏదైతే చూశారో అది కేవలం ట్రైలర్‌ మాత్రమే. సరైన సమయంలో ప్రపంచం మొత్తానికి పూర్తి సినిమా చూపిస్తాం’ అని వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత్‌ 23 నిమిషాల్లోనే తుడిచిపెట్టేసింది. త్రివిధ దళాల పరాక్రమం చూసి యావత్‌ భారతావని గర్విస్తోంది. ఈ ఆపరేషన్‌తో భారత్‌ సైనిక సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది. పాక్‌లోని ప్రతి మూలకూ వెళ్లే సామర్థ్యం మన వైమానిక దళానికి ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌తో అది నిరూపితమైంది. ఈ ఆపరేషన్‌తో మ‌న వైమానిక సామ‌ర్థ్యాన్ని పాక్‌ ప్రత్యక్షంగా చూసింది. పాకిస్థాన్ నేల‌పై ఉన్న 9 ఉగ్ర స్థావరాలను మ‌న మిలిట‌రీ ధ్వంసం చేసిన దృశ్యాల‌ను యావ‌త్ ప్రపంచం తిల‌కించింది. బ్రహ్మోస్ మిస్సైల్ శ‌క్తికి పాక్‌ వణికిపోయింది’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు.

Related posts

ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి!

Ram Narayana

90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో!

Ram Narayana

గుజరాత్‌లో చారిత్రక ఘట్టం.. తొలిసారిగా ఐవీఎఫ్ ద్వారా గిర్ దూడ జననం…

Ram Narayana