జర్నలిస్టులు బాధ్యతలు విస్మరిస్తే సమాజాభివృద్ధికి విఘాతం
బ్రహ్మకుమారీస్ సేవలు అభినందనీయం
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, జర్నలిస్టులు బాధ్యతలు విస్మరిస్తే సమాజాభివృద్ధికి విఘాతం కల్గుతుందని
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహాదేవపూర్ బ్రహ్మకుమారిస్ “సైలెన్స్ రీట్రీట్ సెంటర్లో” జరిగిన జర్నలిస్టులకు మీడియా రోల్ ఆఫ్ ప్రమోటింగ్ పీస్, యూనిటీ అండ్ ట్రస్ట్ సెమినార్ కు ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… ప్రతి జర్నలిస్ట్ బాధ్యతగా పని చేయాలనీ సూచించారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియాలకు లైసెన్స్ ఉంటుందని, వీటిలో ఏదైనా తప్పుడు వార్తలు వస్తే, చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, కొన్ని సామాజిక మధ్యామాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, అలాంటివి రాకుండా ఉండాలంటే సామాజిక మద్యమాలు ఉపయోగించే ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు మంచి, చెడుపై ప్రెస్ అకాడమీ నుండి శిక్షణ తరగతులను నిర్వహించడం ప్రారంభించాం అన్నారు. తద్వారా వారి భాద్యతలు విధులు, రాసే వార్తలపై సమాజానికి ఇబ్బందులు తదితర అంశాలు వుంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఏడాదికి జీడిపి 2.40లక్షల ఆదాయం వున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు నెలకు 20వేల రూపాయలు సంపాదించుకోలేక పోతున్నారని అన్నారు. ఉచిత బియ్యం, రేషన్ కార్డులు పరిస్థితి మరి ఘోరం అన్నారు. రాష్ట్ర జనాభా 3కోట్లు ఉంటే కోటి 20లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని. ఈ కార్డులు అన్ని అర్హులకు దక్కితే ఉపయోగం, కానీ అనర్హుల వద్ద కొన్ని ఉన్నాయని, ప్రతి వ్యక్తి బాధ్యతతో ప్రభుత్వం నుండి అందె ప్రతీ సహాయం నిజమైన లబ్దిదారులకు అందేలా చేస్తే, అది ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో మేలన్నారు. ఈ విషయంలో ఆర్థిక వేత్తలు, రాజకీయ వేత్తలు, సామాజిక బాధ్యత గల ప్రతి ఒక్కరు ఈ విషయమైన ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రహ్మకుమారీస్ వారు ప్రపంచ శాంతికి చేస్తున్నా ప్రయత్నం అభినందనీయం అన్నారు. ఇందులో భాగంగా సరైన సమయంలో జర్నలిస్టులకు బ్రహ్మకుమారీస్ వారు శాంతి స్థాపనకు జర్నలిస్టులకు సెమినార్ నిర్వహించడం మంచి కార్యక్రమం అన్నారు. కుల మతాలకు అతీతంగా వారు చేస్తున్న సేవలు బాగున్నాయన్నారు. జర్నలిస్టుల్లో శాంతి, సమైక్యత, విశ్వసనియత, సత్యం, నిజాయితీ పెరిగితే ప్రజల్లో జర్నలిజం వృత్తి పట్ల గౌరవం పెరుగుతుందన్నారు. సమాజంలో కుల, మతం పేరుతో ఐక్యమత్యానికి భంగం వాటిల్లుతుందన్నారు. ప్రపంచ శాంతికి కుల, మతాలు సైతం అడ్డు అన్న అభిప్రాయ పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఏ దేశానికైనా యుద్ధం సరికాదన్నారు. ప్రపంచం శాంతికి ప్రతి ఒక్కరు ఐక్య మత్యంతో ముందుకు సాగాలన్నారు.
రాజకీయాలకు మీడియా పెద్ద పీఠ
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్

మీడియా రాజకీయ రంగానికి పెద్ద పీఠ వేస్తుందని, ఇది సరి కాదని, మీడియాలో మార్పులు రావాలని మరో విశిష్ట అతిథి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు, టి జే ఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ అన్నారు. జర్నలిస్టులను రాజకీయ నాయకులు పావుల్లగా వాడుకుంటున్నారని అన్నారు. దాదాపు మీడియా స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందని, జర్నలుస్టులు రాసింది పత్రికాధిపతుల చేతులకు వెళ్లి వాళ్లకు నచ్చిందే రాస్తున్నారు తప్ప, ప్రజలకు ఉపయోగ పడే అనేక విషయాలు విస్మరిస్తున్నారని అన్నారు. మీడియాలో రాజకీయ జోక్యం ఉన్నంత వరకు పత్రిక రంగం మనుగడకే ప్రమాదంలో పడుతుందన్నారు. మీడియా అనేది సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడే విధంగా వుండాలన్నారు. బ్రహ్మకుమారీస్ వారు జర్నలిస్టులకు నిర్వహిస్తున్న సెమినార్లు ఎంతో ప్రయోజనకారంగా ఉన్నాయన్నారు. ఈ సందర్బంగా బ్రహ్మకుమారీస్ సేవలు అభినందనీయం అన్నారు.
వివద రాష్ట్రాల నుండి వచ్చిన వక్తలు జర్నలిజం గురించి వివరించారు. ఈ సెమినార్లో ప్రభుత్వ పీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ విద్యావతి, బ్రాహ్మకుమారీస్ మీడియా వింగ్ వైస్ చైర్మన్ పర్సన్ సరళ, ఎస్ ఆర్ సీ డైరెక్టర్ రాజయోగిని బీ కే. దిది, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు సుప్రీం కోర్ట్ న్యాయవాది వై. బాబ్జి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ జర్నలిస్ట్ సంఘాల జర్నలిస్ట్ లు, ఉర్డు, హిందీ, ఆంగ్ల పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు.