తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. పీసీసీలో 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలతో జంబో కార్ప్రయవ కటించింది. అందుకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. పీసీసీ ఉపాధ్యక్షులుగా.. బల్మూరి వెంకట్, బసవరాజ్ సారయ్య, బొంతు రామ్మోహన్, కుమార్‌రావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఝాన్సీరెడ్డి, బండి రమేష్, కొండ్రు పుష్పలీల, కె.నీలిమా, బి.కైలాష్‌కుమార్, ఎన్.శ్రీనివాస్, ఆత్రం సుగుణ, గాలి అనిల్‌కుమార్, సీహెచ్ సత్యనారాయణ, ఎల్.ధన్వంతి, ఎం.వేణు గౌడ్, కె.వినయ్ రెడ్డి, కె.మల్లయ్య, ఎం.ఎ.ఫహీం, ఎస్. సురేశ్‌కుమార్, అక్సర్ యూసుఫ్ జాహీ, ఎస్.జగదీశ్వర్‌రావు, నవాబ్ నిజాహిద్ ఆలం ఖాన్, జి.మోహన్ రెడ్డి, సీహెచ్ సంగమేశ్వర్ ఉన్నారు.
పదవుల పందెరంలో ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం లభించక రగిలిపోతున్న నేతలను బుజ్జగించడం తలప్రాణం తోకకి వచ్చింది. ఈ నేపథ్యంలో పిసిసి కార్యవర్గాన్ని అడిగిన వారికి పదవులు ఇచ్చి సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించారు
Save or share this story as a newspaper-style Epaper Clip: