అహ్మదాబాద్ విమానప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచి వేస్తున్నాయి…అహమ్మదాబాద్ నుంచి లండన్ కు మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటన గురువారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా, ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమై ఉండొచ్చని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు ..కేవలం విమానంలో ఉన్నవారికే ప్రమాదం జరిగిందా లేక పౌరులకు కూడా జరిగిందా అనేది నిర్దారణ కావాల్సి ఉంది … ఇది అత్యంత జుగుస్సాకర దుర్ఘటన … అత్యంత భద్రమైన విమానంగా చెప్పబడుతున్న దీనికి ప్రమాదం జరగడం ప్రపంచంలోనే మొదటిదిగా భావిస్తున్నారు .. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం (ఫ్లైట్ 171) అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి ప్రయాణికులతో బయలుదేరింది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం ఎయిర్ పోర్టు సమీపంలో కూలిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై నిపుణులు స్పందిస్తూ, టేకాఫ్ సమయంలో విమానానికి పక్షి ఢీకొని ఉండవచ్చని, దాని కారణంగా విమానం టేకాఫ్‌కు అవసరమైన సరైన వేగాన్ని, ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని ఎన్డీటీవీకి తెలిపారు.
నిపుణుల విశ్లేషణ
విమానయాన రంగ నిపుణుడు, మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ మాట్లాడుతూ, “ప్రాథమికంగా చూస్తే, ఇది కొన్ని పక్షులు ఢీకొన్న ఘటనలా కనిపిస్తోంది. దీనివల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండవచ్చు. టేకాఫ్ సజావుగానే జరిగింది. అయితే, గేర్లను పైకి తీసుకునే లోపే విమానం కిందికి దిగడం ప్రారంభించింది. ఇంజన్లు శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు కారణం దర్యాప్తులో తేలుతుంది” అని వివరించారు. “దృశ్యాలను బట్టి చూస్తే టేకాఫ్ ఎలాంటి అవాంతరాలు లేకుండానే జరిగినట్లుంది. విమానం నియంత్రిత పద్ధతిలోనే కిందకు వచ్చింది. పైలట్ ‘మేడే’ కాల్ ఇచ్చారు, అంటే అది అత్యవసర పరిస్థితి అని అర్థం” అని నొక్కి చెప్పారు.






అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం
మేఘానిలో కూలిన ఎయిర్‌ఇండియా విమానం
బీజే మెడికల్ కాలేజీపై కూలిన AI 171 విమానం
20 మందికి పైగా మెడికోలు మృతి
మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన విమానం
టేకాఫ్ అయిన వెంటనే కూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్
విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు
విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది
విమానంలో 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు
విమానంలో ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగల్ వాసులు
విమానంలో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న AI 171 విమానం
ప్రమాదస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
సహాయకచర్యల్లో బీఎస్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయకచర్యలు
విమానంలో మాజీ సీఎం విజయ్‌రూపానీ
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ మూసివేత
ఎయిరిండియా హెల్ప్‌లైన్ నెంబర్ 1800 5691 444
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పలు భవనాలు ధ్వంసం.