అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం (Mass Shooting) రేగింది. ఉటా (Utah) రాష్ట్రంలోని సెంటెనియల్ పార్క్ (Centennial Park)లో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఆదివారం రాత్రి వెస్ట్‌ఫెస్ట్ కార్నివాల్‌లో కాల్పులు జరిగినట్లు వెస్ట్ వ్యాలీ సిటీ (West Valley City) పోలీసులు తెలిపారు. ‘సెంటెనియల్ పార్క్‌లో జరుగుతున్న వెస్ట్‌ఫెస్ట్‌లో కాల్పులు జరిగాయి’ అని పోలీసులు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ఘటనలో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో ఇద్దరు గాయపడినట్లు వెల్లడించింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

next post