తెలుగు రాష్ట్రాలు

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం: కేంద్ర కమిటీ

  • ఈ ప్రాజెక్టుకు అభ్యంతరాలు వచ్చాయన్న కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ
  • గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాలన్న కమిటీ
  • పర్యావరణ ప్రభావంపై అంచనా వేసిన తర్వాతే అనుమతి అన్న కమిటీ

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించవలసి ఉంటుందని తెలిపింది. పర్యావరణ అనుమతుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ)ని సంప్రదించడం అత్యవసరమని సూచించింది.

బనకచర్ల ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించింది. అయితే, 1983లో గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలపై కేంద్రం అధ్యయనం చేయాలని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు పొందాలని, పర్యావరణంపై ప్రభావం అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతి ఇవ్వడానికి వీలవుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది.

Related posts

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య?

Ram Narayana

తెలంగాణ నేతల జలదోపిడి ఆరోపణలపై స్పందించిన చంద్రబాబు!

Ram Narayana

రేపు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లి ‘పద్మ విభూషణ్’ అందుకోనున్న చిరంజీవి…

Ram Narayana