క్రైమ్ వార్తలు

సూర్యాపేట జ్యూవెలరీలో భారీ బంగారం దోపిడీ…

తెలంగాణలోని సూర్యాపేటలో భారీ దోపిడి జరిగింది. ఏకంగా ఓ జువెలరీ షాప్ కు కన్నం వేశారు.మాస్టర్ ప్లాన్ వేసి.. మొత్తం జువెలరీని దోచుకున్నారు.
పక్కా ప్రణాళికతో జ్యువెలరీ షోరూం వెనుక భాగం గోడకు రంధ్రాలు చేసి షట్టర్ ను ధ్వంసం చేశారు.గ్యాస్ కట్టర్లతో తిజోరీ ధ్వంసం చేసి దోపిడీ చేశారు.
ఒకటి కాదు రెండు కాదు 18 కేజీల బంగారాన్ని దొంగలు దోపిడీ చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలి అత్యంత రద్దీగా ఉండే ఎంజీ రోడ్డులోని సాయి సంతోషి జ్యూవెల్లర్స్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు.
కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని దోపిడీ చేశారు. సుమారు 17 కోట్ల రూపాయల విలువైన 18 కేజీల బంగారం దోచుకెళ్ళారు దొంగలు. పక్కా ప్లాన్ తో ఆధునిక పద్ధతిలో చోరీ చేశారు.రాత్రి సమయంలో షాపు వెనుక భాగంలో ఉన్న గోడకు రంద్రం చేసి, షట్టర్‌ను గ్యాస్ కట్టర్ సహాయంతో మనిషి పట్టేంత కట్ చేసి దోపిడి దొంగలు లోపలికి వెళ్లారు.
తిజోరి ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌కు రంధ్రం చేసి దొంగ‌లు చోరీకి పాల్పడ్డారు.

Related posts

మర్మాంగంలోకి ఎయిర్‌ బ్లోయర్ దూర్చడంతో పేగులు ఉబ్బి యువకుడి మృతి…

Ram Narayana

సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

Ram Narayana

పంజాబ్‌ మిలటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం…!

Drukpadam