జాతీయ వార్తలు

రాజస్థాన్ లో రాత్రికి రాత్రే ఏర్పడ్డ జలపాతం ..!

  • కుండపోత వర్షాలతో ఎడారి రాష్ట్రం అతలాకుతలం
  • సవాయ్ మాధోపూర్ జిల్లాలో భారీ విధ్వంసం
  • వరదలకు జలపాతాన్ని తలపించేలా 2 కి.మీ. మేర భారీ గుంత

కుండపోత వర్షాలకు రాజస్థాన్ లోని పలు జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. కోట, సవాయ్ మాధోపూర్, బుండి, ఝలావర్ జిల్లాల్లోని గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సవాయ్ మాధోపూర్, జడావట గ్రామాల్లో 2 కిలోమీటర్ల మేర 55 అడుగుల లోతు, 100 అడుగుల వెడల్పుతో భారీ బిలం ఏర్పడింది. ఇది ఓ జలపాతాన్ని తలపిస్తోంది. 

  గ్రామ శివార్లలో భూమి కోతకు గురై ఈ గుంత ఏర్పడింది. రెండు ఇళ్లు, రెండు దుకాణాలు, రెండు ఆలయాలు కొట్టుకుపోయాయి. ఈ గ్రామాలకు సమీపంలో ఉన్న సుర్వాల్ డ్యామ్ నిండిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను వరద ముంచెత్తింది. 

Related posts

‘ఇండియా’ చైర్ పర్సన్‌గా సోనియా.. కన్వీనర్‌గా నితీశ్‌కుమార్!

Ram Narayana

పాకిస్థాన్ పరువు తీసేసిన అసదుద్దీన్ ఒవైసీ..!

Ram Narayana

మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. విచారణలో వెలుగులోకి విస్తుపోయే నిజం!

Ram Narayana