ఖమ్మం వార్తలు

శ్రామిక పీడిత జన స్వరం సురవరం : కూనంనేని

కూనంనేని సాంబశివరావు

శ్రామిక పీడిత జన స్వరం సురవరం

-సుధాకర్రెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: కూనంనేని

-ఉద్యమ గొంతుక మూగబోయింది.

-సంస్మరణ సభలో వక్తలు

-సుధాకర్ రెడ్డికి ఘన నివాళి

60 సంవత్సరాల ప్రజా జీవితంలో సురవరం శ్రామిక, పీడిత జన గొంతుకగా పనిచేశారని ఆయన మరణం ప్రజా -ఉద్యమాలకు తీరనిలోటని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రజ ల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన ఒక నికార్సయిన కమ్యూనిస్టుగా సుధాకర్రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని ఆయన తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు, మాజీ ఎంపి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ శనివారం స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగింది. సభకు ముందు సురవరం చిత్ర పటానికి వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, అభ్యుదయ వాదులు పూలమాలలు వేసి -నివాళులర్పించారు.

జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమ గొంతుకగా సుధాకర్ రెడ్డి పనిచేశారని ఆయన మరణం యావత్ కమ్యూనిస్టు ఉద్యమానికి, పేద ప్రజలకు తీరని లోటన్నారు. ప్రజల కోసమే -జీవించిన ఆయన ఎందరికో ఆదర్శమని ఆయన జీవితం ఓ చరిత్ర అయితే ఆయన మరణం ఒక చారిత్రిక ఘట్టమని ఆయన తెలిపారు. -జననం, మరణం సహాజమే అయినా జీవించి ఉన్న కాలంలో ఎవరి పక్షాన పని చేశాం ఎవరి కోసం పనిచేశామన్నది ప్రధానమని ప్రజల కోసం సామాజిక చైతన్యం కోసం పని చేసి మరణించిన వారు ప్రజల హృదయాలలో జీవించి ఉంటారన్నారు. మతానికి, సైన్స్కు ప్రాంతీయ బేధం -లేనట్లే కమ్యూనిజానికి ప్రాంతీయత లేదన్నారు. కమ్యూనిజం ఒక చారిత్రిక అవసరమైందని విడిపోయి బలహీనపడిన మళ్లీ ఐక్యతతో -బలపడతామని కూనంనేని పిలుపునిచ్చారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లోనూ లక్ష లాది మంది కమ్యూనిస్టు అభిమానులు ఉన్నారని -అలాగే సమాజంలో అట్టడుగు వర్గాల్లో సైతం కమ్యూనిస్టుల పట్ల ఆదరణ తగ్గలేదని ఆయన తెలిపారు. వీరందరిని ఏకతాటిపైకి తెచ్చి కార్యోన్ముఖులను చేయడమే సుధాకర్రెడ్డి లాంటి అమరులకు మనమిచ్చే నివాళి అన్నారు. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, “సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్రెడ్డి లాంటి వారు నిబద్ధతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని వారు చూపిన బాట -ఆదర్శనీయమన్నారు. వంద సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాన్ని నేటి తరానికి వివరిస్తూ భవిష్యత్తులో బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణాల కోసం డిసెంబర్ 26న ఖమ్మంలో శత వసంత ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు కూనంనేని తెలిపారు. లక్షలాది మందితో ఖమ్మం -నగరం ఎరుపెక్కనుందని మరో చారిత్రిక ఘట్టానికి ఖమ్మం వేదిక కానుందని కూనంనేని తెలిపారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ లాంటి మతశక్తులు చరిత్రహీనులు తమ ఫాసిస్టు విధానాలతో ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు. గాంధీని, గాడ్సేను కొలుస్తారని ఆర్ఎస్ఎస్ను నిషేధించిన -వల్లభాయి పటేల్ను అలాగే గోవాల్కర్ను కొలుస్తారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టు సిద్దాంతం అజేయమైంది కాబట్టే బిజెపి కమ్యూనిస్టులను -తమ శత్రువులుగా చూస్తుందని ఆయన తెలిపారు.

కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు: సుదర్శన్ సురవరం సుధాకర్రెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. విద్యార్థి దశ నుంచి తనదైన శైలిలో పోరాటాలను నడిపిన సురవరం ఎందరికో -ఆదర్శంగా నిలిచారన్నారు. సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్రెడ్డి 40 దేశాల్లో పర్యటించి కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారన్నారు. -విద్యుత్ పోరాటంలో సురవరం, బివి రాఘవులు లాంటి వారు ముందుండి ఒక చారిత్రిక ఉద్యమాన్ని నడిపించారని సుదర్శన్ తెలిపారు. సుధాకర్రెడ్డి లాంటి వ్యక్తులు చట్ట సభలలో ఉండి పలు చట్టాలను తీసుకు రావడానికి కారణమయ్యారని ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల వెనక కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిది మరుపురానిదన్నారు. సభలో గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు,

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సిసిఏ =బాధ్యులు, ప్రముఖ వైద్యులు రవీంద్రనాథ్, సిపిఐ (ఎంఎల్) మాసలైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్) -న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ -మహ్మద్ మౌలానా,

టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, టియుడబ్ల్యూజె (టిజెఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ -తదితరులు ప్రసంగించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి ఆహుతులను వేదికపైకి ఆహ్వానించగా స్పర్శ అధ్యయన వేదిక బాధ్యులు స్పర్శ భాస్కర్, సిసిఏ బాధ్యులు రవిమారుత్, బఏఎల్ నాయకులు పోట్ల మాధవరావు, ప్రముఖ వైద్యులు వై. ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు వడ్డె నారాయణరావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, ఎస్కె జానిమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, బిజి క్లెమెంట్, మహ్మద్ సలాం, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బడికి రాని విద్యార్థి.. ఇంటి ముందు టీచర్లు, విద్యార్థుల ధర్నా!

Ram Narayana

ఆందోళనలు .. ట్రాఫిక్ జామ్ , అరెస్టులతో అట్టుడుకిన ఖమ్మం ….

Ram Narayana

12న నూరేళ్ల అరుణ కేతనం ఆవిష్కరణ

Ram Narayana