తెలంగాణ వార్తలు

అక్టోబర్ 14న తెలంగాణ బంద్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

అక్టోబర్ 14న తెలంగాణ బంద్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరసనగా 2025, అక్టోబర్ 14న బీసీ సంఘాలు తెలంగాణ బంద్‎కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బీసీ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 14న తలపెట్టిన తెలంగాణ బంద్‎ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. 14వ తేదీకి బదులు అక్టోబర్ 18న తెలంగాణ బంద్ నిర్వహిస్తామని వెల్లడించాయి. ఆదివారం (అక్టోబర్ 12) లక్డీకపూల్‎లోని అశోక హోటల్‎లో బీసీ సంఘాలు సమావేశమయ్యాయి.

ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై ఐక్యంగా పోరాడటం కోసం బీసీ సంఘాలన్నీ బీసీ జీఏసీగా ఏర్పడ్డాయి. బీసీ జేఏసీ చైర్మన్‎గా రాజ్య సభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, వైస్ చైర్మన్‎గా వీజీఆర్ నారగోని, వర్కింగ్ ఛైర్మెన్‎గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్లుగా దాసు సురేష్, రాజారామ్ యాదవ్‎లు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలోనే అక్టోబర్ 14న తలపెట్టిన బీసీ సంఘాల తెలంగాణ బంద్‎ను ఈ నెల 18కి వాయిదా వేయాలని నిర్ణయించారు.

Related posts

భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు..

Ram Narayana

హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలతో మాట్లాడతాం: ట్రంప్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

Ram Narayana

లులు మాల్‌లో అసభ్య ప్రవర్తన.. ఫ్యాన్స్‌పై ఫిర్యాదు చేయడం ఇష్టంలేదన్న నటి నిధి అగర్వాల్

Ram Narayana