జాతీయ వార్తలు

మావోల్లో అలజడి …ఆయుధాలు వీడాలని ఒక వర్గం …వద్దని మరో వర్గం

తుఫాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని అనేక సైద్దతింక చర్చలు అనంతరం కమ్యూనిస్టులతో సరిపడక చీలిపోయి చార్ మజుందార్ నాయకత్వంలో నక్సల్బరీ బరిలో ఏర్పాటైన నక్సలిజం దేశంలో రాజ్యంపై యుద్దాన్ని ప్రారంభించింది .. సోషలిజం స్థాపనే లక్ష్యంగా విప్లవ గ్రూప్ ను ఏర్పాటు చేసింది ..అందులోను చీలికలు ఏర్పడ్డాయి అది వేరే విషయం… అనేకమంది మేధావులు ,బుద్ది జీవులు , విద్యార్థులు ,యువకులు దానికి జై కొట్టారు ..యూనివర్సిటీలు అప్పటి ఆర్ ఎస్ యూ కేంద్రాలుగా మారాయి.. సుమారు 58 సంవత్సరాలుగా తాము నమ్ముకున్న సిద్ధాతం కోసం చిత్తశుద్ధితో పనిచేసి అశువులు బాసిన వారు అనేక మంది ఉన్నారు …ఆరోగ్య కారణాలతో లొంగిపోయినవారు ఉన్నారు …ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను ఛత్తీస్ ఘడ్ , మధ్య ప్రదేశ్, బీహార్ , బెంగాల్, జార్ఖండ్ , ఒడిస్సా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు …ఒకరకంగా చెప్పాలంటే రాజ్యానికి సవాల్ విసిరారు ..అయితే వారు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం , మొదట్లో ఉన్నంత ఊపు ఉత్సాహం లేకపోవడం ..అనేమంది పార్టీ నిర్మాణంలో ఉన్న నాయకులూ చనిపోవడం లాంటి ఘటనలు మావోయిస్టు పార్టీని దెబ్బతిశాయి… అక్కడ డక్కడ ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘటనలు చేసిన నేలవిడిచి సాము చేసినట్లుగా ఉన్నాయి…ప్రజల సహకారం తగ్గింది …బలమైన రాజ్యం ముందు తట్టుకునే శక్తి సన్నగిల్లింది …ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వారి రహస్య ప్రదేశాలను తెలుసుకోవడం భద్రతా దళాలకు ,పోలీసులకు తేలికైంది ..దీంతో మరణమా..?శరణమా..? అనే చర్చకు దారితీసింది ..రెండు వర్గాలుగా విడిపోయింది ..మల్లోజుల వేణుగోపాల్ లాంటివారు తమ పంథా సరైంది కాదని ఆయిదాలు వదిలి పంథా మార్చుకోవాలని కోరారు … సమర్ధించిన మరికొంతమంది దానికి అంగీకరించలేదు ..చివరకు అనేక పరిణామాల నేపథ్యంలో పొలిట్ బ్యూరో సభ్యునిగా కీలకమైన బాధ్యతల్లో ఉన్న మల్లోజుల మహారాష్ట్రలోని గచ్చిరోలిలో 60 మంది అనుచరులతో లొంగిపోయారు ..ఇది మావోయిస్టు చరిత్రలో ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ …పొలిట్ బ్యూరో సభ్యులు లొంగిపోయిన చరిత్ర ఆ పార్టీలో లేదు …దీంతో ఆ పార్టీ మనుగడ ప్రశ్నర్ధకంగా మారింది …కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నట్లు 2026 ఫిబ్రవరి నాటికీ మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా పోతుందా …? అనేది ఆసక్తిగా మారింది …

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. అగ్రనేత వేణుగోపాల్ లొంగుబాటు
ఆయనతో పాటు మరో 60 మంది కూడా లొంగుబాటు
దివంగత నేత కిషన్‌జీకి వేణుగోపాల్ స్వయానా సోదరుడు

మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైన కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో సభ్యుడిగా ఉన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయన తన అనుచరులు 60 మందితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి ఊహించని షాక్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.

గత కొంతకాలంగా పార్టీ అనుసరిస్తున్న విధానాలతో వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమాన్ని విజయవంతం చేయాలంటే ప్రజల్లోకి బహిరంగంగా వెళ్లడమే సరైన మార్గమని ఆయన భావించినట్లు సమాచారం. ఇదే విషయంపై పార్టీకి ఆయన రాసిన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం, దివంగత మావోయిస్టు నేత, తన సోదరుడైన మల్లోజుల కోటేశ్వరరావు (కిషన్‌జీ) పేరుతో రాసిన మరో లేఖలో కూడా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే తాను పార్టీ నుంచి శాశ్వతంగా వైదొలగుతున్నట్లు వేణుగోపాల్ ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీలో ఇకపై కొనసాగలేనని స్పష్టం చేస్తూ ఆయన మావోయిస్టు పార్టీని వీడారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే, తన అనుచరులతో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆయన లొంగిపోవడం గమనార్హం. ఆయన లొంగుబాటుకు దారితీసిన కచ్చితమైన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ప్రభుత్వానికి లొంగిపోయారు. తానొక్కడే కాదు 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర పోలీసులకు మంగళవారం లొంగిపోయారు. ఈ అరవై మందిలో ఎంత మంది కీలక నేతలున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు (డీవీఎంలు) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆయుధాలు వదిలేస్తాం’ అంటూ మల్లోజుల చేసిన ప్రకటన మావోయిస్ట్ పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపింది. అది మల్లోజుల వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ నిర్ణయం కాదని తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ కౌంటర్ ప్రకటన జారీ చేశారు. తన వద్దగల తుపాకులు పార్టీకి అప్పగించాలని, లేనిపక్షంలో పీఎల్జీఏ (పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) స్వాధీనం చేసుకుంటుందని జగన్ హెచ్చరించారు. అనంతరం మల్లోజుల పేరుతో మరికొన్ని వరుస ప్రకటనలు కూడా విడుదలయ్యాయి.

Related posts

అఘోరాలు ఎవరు? వారు శవాలతో సహవాసం ఎందుకు చేస్తారు..?

Ram Narayana

“నరేందర్… సరెండర్” అని ట్రంప్ అనగానే ప్రధాని మోదీ లొంగిపోయారు: రాహుల్ తీవ్ర విమర్శలు

Ram Narayana

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

Ram Narayana