Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జనరల్ వార్తలు ...

నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం!

నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం!
శివ కేశవుకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం ఈరోజు బుధవారం నుంచి ప్రారంభం కానుంది, విశిష్టమైన కార్తీక మాసంలో దీపారాధన చేయడం ద్వారా సర్వ పాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం సూర్యోదయానికి ముందే గోదావరి నది స్థానం చేసి శివకేశవ పూజలు చేసిన వారికి విశిష్టమైన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం…

హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈ మాసం నేడు ప్రారంభమవు తోంది. “న కార్తీక నమో మాసః, న దేవం కేశవాత్పరం! న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాస్తమమ్!!”* అని స్కంద పురాణం లో పేర్కొనబడింది.

అంటే కార్తీక మాసానికి సమానమైన నెల లేదు, కేశవుడికి సమానమైన దేవుడు లేడు, వేదాలకు సమానమైన శాస్త్రం లేదు, గంగకు సమానమైన తీర్థం లేదు అని అర్థం. ఈ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికర మైన కాలంగా ఉండటంతో, భక్తులు శివాలయాలు, విష్ణు ఆలయాలను దర్శించడానికి, దీపాలు వెలిగించడానికి, వ్రతాలు ఆచరించడానికి ముందుంటారు.

కార్తీక మాసం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే సమయం. ఈ కాలంలో శివుడు, కేశవుడు ఇద్దరినీ పూజించడం ద్వారా జన్మజన్మాంతర పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. భక్తులు తెల్లవారుజామున నదీ స్నానం చేయడం, దీపారాధన, రుద్రాభిషేకం, తులసి పూజ, విష్ణు సహస్రనామ పారాయణం వంటి ఆచారాలను పాటిస్తారు.

ముఖ్యంగా కార్తీక దీపం వెలిగించడం అత్యంత పుణ్యప్రదమని పండితులు సూచిస్తున్నారు. ఈ నెలలో ఉపవాసం, ధ్యానం, భజనల ద్వారా ఆత్మశుద్ధి సాధించవచ్చని విశ్వాసం ఉంది.కార్తీక మాసంలో పూజలు, దానాలు, ఉపవాసాలు చేయడం ద్వారా భక్తుడికి అఖండ పుణ్యం లభిస్తుంది.

ఈ నెలలో గంగా స్నానం, అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటివి శివకేశవు ల కృపను పొందడానికి మార్గంగా పరిగణించబడ తాయి. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి, తులసి కోట వద్ద దీపారాధన చేయడం భక్తి శ్రద్ధకు సూచిక. ఈ పవిత్ర మాసంలో ప్రతి భక్తుడు తన ఆత్మను దేవుని సన్నిధిలో లయపరచుకునే అవకాశం కలుగుతుంది.

అందుకే కార్తీకం భక్తి, శాంతి, పుణ్యానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక యాత్రగా భావించబడుతోంది.

Related posts

జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది.. విడుదల చేసిన ఎన్‌టీఏ

Ram Narayana

విశాఖ ఆర్కేబీచ్‌‌ తీరంలో విషపూరిత జెల్లీఫిష్‌.. మత్స్యసంపదకు పెనుముప్పు!

Ram Narayana

మలేసియా మాజీ ప్రధాని మహతీర్ కు 100 ఏళ్లు … ఆరోగ్యం రహస్యం ఇదే!

Ram Narayana

Leave a Comment