Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ట్రంప్ ప్రతిపాదనలు.. పుతిన్ అంగీకరిస్తారో లేదోనన్న జెలెన్‌స్కీ!

  • రష్యా – ఉక్రెయిన యుద్ధం ముగింపునకు ట్రంప్ ప్రతిపాదనలు
  • ట్రంప్ ప్రతిపాదనలు సరైనవేనన్న జెలెన్‌స్కీ
  • పుతిన్ అంగీకరిస్తారో లేదోనని తాను ట్రంప్‌నకు కూడా తెలియజేశానన్న జెలెన్‌స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలు సమంజసమైనవని, రాజీకి ఇది ఒక మంచి ప్రయత్నమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరిస్తారా లేదా అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ట్రంప్‌కు తెలియజేసినట్లు తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేందుకు ఆయన ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేశారు. సైనికులు ఎక్కడ ఉన్నారో అక్కడే యుద్ధాన్ని నిలిపివేసి చర్చలు జరపాలని ట్రంప్ సూచించారు. దీనిపై జెలెన్‌స్కీ స్పందిస్తూ ట్రంప్ ప్రతిపాదనలను సమర్థించారు.

ఇటీవల ట్రంప్, పుతిన్ ఫోన్‌లో మాట్లాడుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని కీలకమైన దొన్నెట్స్క్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని పుతిన్ పట్టుబట్టినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో తమ సేనల ఆధీనంలో ఉన్న జపోరిజియా, ఖేర్సాన్‌లను ఉక్రెయిన్‌కు అప్పగించేందుకు పుతిన్ అంగీకరించారని తెలుస్తోంది. ప్రతిగా, ఉక్రెయిన్ దొన్నేట్స్క్ ప్రాంతాన్ని సంపూర్ణంగా తమకు అప్పగించాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నేతలకు ట్రంప్ పలు ప్రతిపాదనలు చేశారు.

Related posts

రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ!

Ram Narayana

బీచ్‌లో గులకరాళ్లు ఏరుకెళ్లే టూరిస్టులపై రూ. 2 లక్షల ఫైన్.. కెనరీ ఐల్యాండ్స్ నిర్ణయం

Ram Narayana

ఇది మామూలు భూకంపం కాదు… భారీగా ప్రాణనష్టం నమోదవ్వొచ్చు: యూఎస్ జీఎస్!

Ram Narayana

Leave a Comment