Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

కొలికపూడి-కేశినేని చిన్ని వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!

  • విజయవాడ ఎంపీ కేశినేని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి మధ్య బహిరంగ విమర్శలు
  • ఇద్దరు నేతల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి 
  • క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని గట్టి హెచ్చరిక
  • దుబాయ్ నుంచి వచ్చాక తానే స్వయంగా మాట్లాడతానని వెల్లడి
  • సమస్యలను పార్టీలోనే చర్చించాలి, బయట కాదని నేతలకు సూచన

తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇద్దరు కీలక నేతల మధ్య రాజుకున్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరస్పరం బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక అంశాలపై మొదలైన ఈ వివాదం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడంతో పార్టీ పరువుకు భంగం వాటిల్లుతోందని అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరు నేతలను పిలిచి సర్దిచెబుతానన్న పల్లా ప్రతిపాదనను ఆయన తిరస్కరించినట్టు తెలిసింది. తాను యూఏఈ నుంచి తిరిగి రాగానే ఈ అంశంపై స్వయంగా దృష్టిసారిస్తానని చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం.

పార్టీలో కొందరు నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ రేఖ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఏవైనా సమస్యలు, అభిప్రాయభేదాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకోవాలి తప్ప, ఇలా బహిరంగంగా రచ్చ చేయడం పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆయన హితవు పలికారు.

తిరువూరు నియోజకవర్గంలోని కొన్ని స్థానిక సమస్యలతో ప్రారంభమైన ఈ వివాదం, ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారని కొలికపూడి సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఆ మేరకు చిన్ని అనుచరులకు డబ్బు ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్ మెంట్ ను తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుని తీవ్ర కలకలం రేపారు. అందుకు ఎంపీ కేశినేని చిన్ని కూడా ఘాటుగానే స్పందించారు. నిన్నటివరకు తనను దేవుడు అన్న కొలికపూడికి… ఇప్పుడు తాను దెయ్యంలా కనిపిస్తున్నానా అంటూ విమర్శించారు. 

Related posts

జగన్ 30 ఏళ్లు పాలించడం కాదు… జీవితాంతం జైల్లో ఉండాల్సిందే: యనమల…

Ram Narayana

కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక!

Ram Narayana

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. హాజరుకావడంపై నేడు టీడీపీ నిర్ణయం

Ram Narayana

Leave a Comment