Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

ఆ రెండు రంగాల వారే ఎక్కువ.. వివాహేతర సంబంధాలపై సంచలన నివేదిక!

  • వివాహేతర సంబంధాల్లో బెంగళూరుకు అగ్రస్థానం
  • గ్లీడెన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడి
  • తర్వాతి స్థానాల్లో ముంబై, కోల్‌కతా, ఢిల్లీ
  • ఐటీ, వైద్య రంగాల వారిలోనే ఈ ధోరణి అధికం
  • విడాకులు, కుటుంబ కలహాలు పెరగడానికి ఇదే కారణం
  • కుటుంబానికి సమయం ఇవ్వకపోవడమే అసలు సమస్య

భారతీయ నగరాల్లో వివాహేతర సంబంధాల ధోరణిపై గ్లీడెన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో టెక్ హబ్ బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బెంగళూరు తర్వాత ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, పుణె నగరాలు వరుసగా ఉన్నాయి.

సమాజంలో విడాకులు, కుటుంబ కలహాలు పెరగడానికి వివాహేతర సంబంధాలే ప్రధాన కారణమని ఈ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐటీ, వైద్య రంగాల్లో పనిచేస్తున్న వారిలోనే ఈ ధోరణి ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. వృత్తిపరమైన ఒత్తిళ్లు, కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవడం, భాగస్వామి అవసరాలను పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్లే చాలామంది పక్కచూపులు చూస్తున్నారని సర్వేలో గుర్తించారు.

ఈ పరిణామంపై మనస్తత్వవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, కొందరి జీవితాలు చీకటిమయంగా మారుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. క్షణికమైన ఆనందం కోసం తీసుకునే నిర్ణయాలు కుటుంబ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

వైద్య చరిత్రలోనే అత్యద్భుతం.. మహిళకు రెండు గర్భాశయాలు..

Ram Narayana

ఆ ఊళ్లో ఇళ్లకు తలుపులు ఉండవు… అయినా ఒక్క దొంగతనం జరగదు!

Ram Narayana

విమానాశ్రయంలో పెంపుడు కుక్కను చంపేసి విమానం ఎక్కిన మహిళ.. అమెరికాలో ఘటన!

Ram Narayana

Leave a Comment