Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

వరాలు ప్రకటించడానికి ముందు వాటికి సమాధానం చెప్పండి: ప్రియాంక గాంధీ!

  • సోన్‌బర్సాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రియాంక గాంధీ
  • ప్రధానమంత్రి అనవసర విషయాలు మాట్లాడుతున్నారని విమర్శ
  • ఎన్డీయే ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనపై మాట్లాడటం లేదని ఆగ్రహం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే కూటమి వరాలు ప్రకటిస్తోందని, గత ఇరవై ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను ఏఐసీసీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. సోన్‌బర్సాలో నిర్వహించిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి అనవసర విషయాలన్నీ మాట్లాడుతున్నారని విమర్శించారు.

బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనపై మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. దేశాన్ని, బీహార్‌ను అవమానించారని ప్రతిపక్ష నాయకులపై ప్రధాని ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ‘అవమానాల మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా దేశాన్ని, బీహార్‌ను అవమానిస్తున్నారని విమర్శలు చేయడమేమిటని అన్నారు.

ఎన్నికలు ఉన్నాయనే కారణంతో వరాలు ప్రకటించడం కంటే ముందు ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీహార్ ప్రభుత్వాన్ని నితీశ్ కుమార్ నడపడం లేదని, ప్రధానమంత్రి, ఇతర వ్యక్తులు ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తున్నారని అన్నారు. ప్రజల ఓటు హక్కును లాక్కునేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళుతోందని, వారికి ఉపాధి అవసరమని అన్నారు.

Related posts

వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమిదే హవా… టైమ్స్ నౌ సర్వేలో ఆసక్తికర అంశాలు

Ram Narayana

యూపీ సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలపై స్పందించిన అఖిలేశ్ యాదవ్…

Ram Narayana

ఈజిప్టు సదస్సుకు మోదీ దూరంగా ఉండటంపై శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Ram Narayana

Leave a Comment