జాతీయ వార్తలు

బీహార్ ఎంపీ రెండు వేళ్లకూ సిరా గుర్తులు.. వివాదం కావడంతో జిల్లా యంత్రాంగం వివరణ..

  • తొలి దశ పోలింగ్ సమయంలో ఓటు వేసిన ఎంపీ శాంభవి
  • మీడియా ముందుకు వచ్చి రెండు వేళ్లకూ సిరా గుర్తు చూపిన ఎంపీ
  • ఇది మానవ తప్పిదమని ఎంపీ, జిల్లా యంత్రాంగం వివరణ

లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్)కి చెందిన ఎంపీ శాంభవి చౌదరి రెండు వేళ్లకూ సిరా గుర్తు ఉండటం వివాదానికి దారితీసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలిదశ పోలింగ్ 6న ముగిసింది. తొలి దశ పోలింగ్ సమయంలో ఎంపీ శాంభవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత తన కుటుంబంతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు కుడి చేతికి ఉన్న సిరా గుర్తును చూపించారు.

అనంతరం తండ్రి సంజ్ఞ చేయడంతో ఆమె ఎడమ చేతికి ఉన్న సిరా గుర్తును చూపించారు. రెండు వేళ్లకూ సిరా గుర్తు ఉండటం వివాదానికి దారి తీసింది. ఆమె రెండుసార్లు ఓటు వేశారనే విమర్శలు వచ్చాయి.

ఇది వేరే స్థాయి మోసమని, ఇలా ఎందుకు జరుగుతుందని ఆర్జేడీ ప్రశ్నించింది. దీనిపై ఎవరు దర్యాప్తు జరుపుతారని నిలదీసింది. అయితే, ఇది మానవ తప్పిదం మాత్రమేనని, దీనిని వివాదం చేయవద్దని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో పాట్నా జిల్లా అధికారులు స్పందించారు. ఇది పోలింగ్ సిబ్బంది కారణంగా జరిగిన తప్పిదమని, సిబ్బందిలో ఒకరు కుడిచేతి వేలికి ఇంక్ వేసినట్లు విచారణలే తేలిందని పేర్కొన్నారు. తర్వాత ప్రిసైడింగ్ అధికారి జోక్యంతో ఎడమ చేతి వేలికి కూడా సిరా గుర్తు వేశారని స్పష్టం చేశారు. ఆమె ఓటు వేసిన కేంద్రం, ఆమె సీరియల్ నెంబర్ వివరాలను కూడా వెల్లడించారు.

Related posts

జీవిత భాగస్వామి ఉండగా ‘సహజీవనం’ ముస్లిం సూత్రాలకు విరుద్ధం: అలహాబాద్ హైకోర్ట్ తీర్పు

Ram Narayana

రళ శబరిమల టెంపుల్లో భక్తులకు క్యూ లైన్ టికెట్లు (వర్చువల్ క్యూ బుకింగ్)

Ram Narayana

శక్తి ఉంటేనే శాంతి.. ప్రపంచం మన సత్తా చూసింది: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్!

Ram Narayana