తెలంగాణ వార్తలు

ఆటో ఇవ్వకుంటే పామును వదులుతా.. ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన ఆటో డ్రైవర్..

  • ఆటో వదిలేయకుంటే పామును వదులుతానని ట్రాఫిక్ సిబ్బందికి బెదిరింపులు
  • హైదరాబాద్ లోని పాతబస్తీలో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

మద్యం మత్తులో ఆటో నడుపుతూ పట్టుబడిన ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసులను పాముతో బెదిరించాడు. తన ఆటోను ఇవ్వకుంటే పామును వదులుతానని హల్ చల్ చేశాడు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..

చాంద్రాయణ గుట్ట చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ సిబ్బంది అటుగా వచ్చిన ఓ ఆటోను ఆపారు. ఆటో డ్రైవర్ ను పరీక్షించగా మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు.

ఆటోలో ఉన్న తన సామగ్రి తీసుకుంటానని వెళ్లిన డ్రైవర్… ఆటోలో నుంచి ఓ పామును తీసుకువచ్చి పోలీసులను బెదిరించాడు. ఆపై ఆటోను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆటో డ్రైవర్ ను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Related posts

తెలంగాణలో మాంసాహారం జోరు.. పదేళ్లలో 5 రెట్లు పెరిగిన మాంసం వినియోగం…

Ram Narayana

ప్రయాణికుడికి ఇబ్బంది.. హైదరాబాద్ మెట్రోకు ఫైన్

Ram Narayana

పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు!

Ram Narayana