తెలుగు రాష్ట్రాలు

సీఎం పర్యటన నేపథ్యంలో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్ర ముఖ్యమంత్రి  పర్యటన నేపథ్యంలో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఈనెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఖమ్మంలో ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు తెలిపారు. కావున వాహన ప్రయాణికులు ట్రాఫిక్ ఆంక్షలు/ మళ్లింపును దృష్టిలో పెట్టుకుని పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి తమ గమ్యస్థానానికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా భారీ వాహనాలు, లారీలకు ఇబ్బందులు తలెత్తకుండా.. ట్రాఫిక్ సజావుగా వెళ్లే వరకు హోల్డింగ్ పాయింట్లలో నిలుపుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతున్న దృశ్య నగర ప్రజలు, వాహనదారులు అవసరం ఉంటే తప్ప తమ వాహనాలను రోడ్లపైకి తీసుకురావద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు

1️⃣ ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు
రాజమండ్రి- దేవరపల్లి – జంగారెడ్డిగూడెం- అశ్వరావుపేట- సత్తుపల్లి- భద్రాచలం- కొత్తగూడెం -మణుగూరు మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు (కార్లు, చిన్న వాహనాలు మాత్రమే) కల్లూరు మరియు వైరా సోమవరం గ్రామం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి కోదుమూరు వద్ద హైవే దిగి అల్లిపురం మీదుగా బోనకల్ రోడ్డు చేరుకొని ధంసలపురం బ్రిడ్జి దగ్గర నుండి మరల గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది.

2️⃣ హైదరాబాద్ నుంచి భద్రాచలం / కొత్తగూడెం వైపు వెళ్లే వాహనాలు
హైదరాబాద్ నుండి భద్రాచలం- కొత్తగూడెం సత్తుపల్లి – అశ్వరావుపేట- -రాజమండ్రి వెళ్ళు వాహనాలు పొన్నెకల్లు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద హైవే దిగి (కార్లు,చిన్న వాహనాలు మాత్రమే) ప్రకాష్ నగర్, చర్చి కాంపౌండ్, ముస్తఫా నగర్, అల్లిపురం మీదుగా కోదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బిడ్జి కింద నుండి వందనం మీదుగా కొత్త కలెక్టరేట్ సమీపంలోని వైరా రోడ్డు చేరుకొని భద్రాచలం – రాజమండ్రి వైపు వెళ్ళవలసి ఉంటుంది.

3️⃣ సత్తుపల్లి / అశ్వరావుపేట నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు
సత్తుపల్లి -అశ్వరావుపేట నుంచి వరంగల్ వైపునకు వెళ్లి వాహనాలు ఖమ్మం కలెక్టరేట్ దాటిన తర్వాత ఎస్ఆర్ గార్డెన్ నుంచి రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ మీదుగా లింగాల చేరుకొని డోర్నకల్- మహబూబాద్ మీదుగా వరంగల్ వెళ్ళవలసి ఉంటుంది.

4️⃣ ఇల్లందు నుంచి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వాహనాలు ఇల్లందు నుండి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వాహనాలు రఘునాధపాలెం ఆపిల్ సెంటర్ నుండి ఎస్సార్ గార్డెన్ వచ్చి గోపాలపురం- గొల్లగూడెం మీదుగా లకారం చేరుకొని ఖమ్మం పట్టణంలోకి వెళ్లవలసి ఉంటుంది.

5️⃣ వరంగల్ నుంచి ఖమ్మం / సత్తుపల్లి / కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు
వరంగల్ నుండి సత్తుపల్లి – రాజమండ్రి- కొత్తగూడెం మరియు ఖమ్మం పట్టణం లోకి వచ్చే (కార్లు, చిన్న వాహనాలు మాత్రమే) ఎదులాపురం ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ మీదుగా నాయుడుపేట చేరుకొని అక్కడి నుండి గాంధీ చౌక్ మీదుగా చర్చి కాంపౌండ్ ముస్తఫానగర్- అల్లిపురం కోదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బిడ్జి కింద నుండి వందనం మీదుగా కొత్త కలెక్టరేట్ సమీపంలోని వైరా రోడ్డు కు వెళ్లవలసి ఉంటుంది. పి ఆర్ వో

Related posts

భద్రాచలం వద్ద ఐదు ఊళ్ళు ఇవ్వాలని ప్రధానిని కోరాం…డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

ఏపీలో హార్ట్‌ఫుల్‌నెస్ విస్తరణ.. దాజీతో సమాలోచనలు జరిపిన సీఎం…

Ram Narayana

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న… పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

Ram Narayana