తెలంగాణ వార్తలు

మద్యంపై మారని ప్రభుత్వ తీరు-సిపిఐ నాయకులు కె. నారాయణ

-మద్యంపై మారని ప్రభుత్వ తీరు-సిపిఐ నాయకులు కె. నారాయణ

మద్యం అమ్మకాలను ఆదాయ వనరులుగా చూస్తూ ప్రజలను దోచుకుంటున్నారని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ తెలిపారు. సోమవారం ఖమ్మంలో వైన్ షాపులను ఆయన సందర్శించారు. ప్రభుత్వాలు మారిన లిక్కర్ పాలసీలో మాత్రం మార్పులు రావడం లేదన్నారు. గత ప్రభుత్వాల కంటే లిక్కర్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వాలు మరింత ఆదాయాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన బెల్ట్ పులను -ఎత్తివేస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీని మరిచిపోయారని నారాయణ తెలిపారు. లక్ష రూపాయల డిపాజిట్ సొమ్మును ఈ ప్రభుత్వం పెంచిందని బెల్ట్ షాపులను కూడా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. బార్ షాపుల వద్ద మద్యం వ్యాపారాలను పెంచుకునేందుకు ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారని మద్యం దుకాణాల పక్కనే బార్లను తలపించే రీతిలో సిట్టింగ్లను ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. కుటుంబాలు ఛిద్రమవుతున్న పాలకులకు పట్టడం లేదని -ఆయన తెలిపారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే పద్దతిని ప్రభుత్వాలు విడనాడాలని నారాయణ డిమాండ్ చేశారు.

మద్యాన్ని కూడా అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియులను దోచుకుంటున్నారన్నారు. మద్యం దుకాణాల్లో విక్రయించాల్సిన మద్యాన్ని బెల్ట్ షాపుల్లో ఉంచి ఎంఆర్పి కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక్కో బాటిల్పై రూ. 25ల నుంచి రూ. 50ల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నారాయణ వెంట సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కర్ణకుమార్, రావి శివరామకృష్ణ, సిపిఐ నాయకులు మడుపల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Related posts

తెలంగాణ సరిహద్దు సమీపంలో కాల్పుల మోత… ముగ్గురు మావోయిస్టుల మృతి

Ram Narayana

ఆటో ఇవ్వకుంటే పామును వదులుతా.. ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన ఆటో డ్రైవర్..

Ram Narayana

భట్టి బడ్జెట్ బాగుంది …బాగాలేదు …స్పందన మిశ్రమం

Ram Narayana