తెలంగాణ వార్తలు

విద్యాహక్కును కాపాడేందుకు రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలు ..పీడీఎస్ యూ

విద్యాహక్కును కాపాడేందుకు రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలు చేపట్టాలని ఖమ్మంలో జరిగిన 23 వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానించినట్లు పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష కార్యాదర్శులు కంపాటి పృద్వి ,ప్రధాన కార్యదర్శి ఎస్ .అనిల్ తెలిపారు .ఈ మేరకు వారు సోమవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాసభలో చేసిన తీర్మానాలు రాష్ట్ర కమిటీకి ఎన్నికైన సభ్యుల వివరాలు వెల్లడించారు ..రానున్న కాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరానికి మరింత పట్టుదలతో ఉద్యమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు ..

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర 23వ మహాసభలు ఖమ్మం నగరంలోని జార్జ్ రెడ్డి నగర్, భక్త రామదాసు కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు (జనవరి 23, 24, 25) అత్యంత ఉత్సాహభరితంగా, విజయవంతంగా ముగిశాయి.

ఈ మహాసభల్లో రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు, యువకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణ–కమర్షియలైజేషన్ దాడులు, ఫీజుల భారం, నిరుద్యోగం వంటి సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. విద్య హక్కును కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని మహాసభ పిలుపునిచ్చింది.

బహిరంగ సభ,విద్యా గోష్టి ,సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యాన్ని రగిలించాయి అనితెలిపారు.అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించాలనే సంకల్పాన్ని మహాసభ ప్రకటించింది.ఈ మహాసభల్లో నూతన రాష్ట్ర నాయకత్వాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.భవిష్యత్ కార్యాచరణ,ప్రణాళికను ఆమోదించుకోవడం జరిగింది.
పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్ చార్జీలను పెంచి వెంటనే ఇవ్వాలి
పి.డి.ఎస్.యు. తెలంగాణ కమిటీ

రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులుగా కంపాటి పృథ్వీ ,ఎస్.అనిల్, కోశాధికారిగా అంగిడి కుమార్ ఎన్నికైయ్యారు ..వీరు గాక ఉపాధ్యక్షులుగా బి .నర్సింహ రావు వరంగల్-హన్మకొండ ,
ఎం.నరేందర్ నిజామాబాద్,ఎస్.రాకేష్ హైదరాబాద్,దీక్షిత హైదరాబాద్,మునిగెల శివ ప్రశాంత్ భద్రాద్రి కొత్తగూడెం ఎన్నికైయ్యారు .సహాయ కార్యదర్శుగా వంగూరి వెంకటేష్ ఖమ్మం,సురేష్ కామారెడ్డి,డాక్టర్ కర్కా గణేష్ నిజామాబాద్, బోయినపల్లి అజయ్ వరంగల్-హన్మకొండ ,వీరభద్రం భద్రాద్రి కొత్తగూడెంలు ఉన్నారు .. రాష్ట్ర కమిటీ సభ్యులుగా హరీష్,నాగరాజు,చైతన్య హైదరాబాద్, సీతారాం,మారుతి,మహబూబ్ నగర్, వెంకటేష్,మహేష్ నారాయణపేట,దినేష్ వనపర్తి,హరీష్ గద్వాల,అఖిల్ నిజామాబాద్,స్పందన,శ్రవణ్ భద్రాద్రి కొత్తగూడెం, టి.లక్ష్మణ్, శశి కిరణ్ ఖమ్మం,బాలకృష్ణ,వినయ్,వి.కావ్య, పి.అనూష, వరంగల్-హన్మకొండ అనిల్,అషూర్,నిజామాబాద్,హర్ష వర్ధన్ నల్గొండ,చందర్ రావు సూర్యాపేట,సిద్దిపేట మధుసూదన్,వినోద్ ఆదిలాబాద్,బొట్ల గౌతమ్ మహబూబాబాద్,రాందాస్ కామారెడ్డి,నిర్మల్ కిరణ్,తుర్రం నవీన్ ఎన్నికైయ్యారు .

ఈ మహాసభల్లో విద్య, ఉద్యోగాలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానించారు.

నూతన జాతీయ విద్యావిధానం-2020 రద్దు చేయాలి.
UGC నూతన ముసాయిదా వెనక్కి తీసుకోవాలి.
విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి.
కార్పొరేట్ విద్యాసంస్థల రద్దుకై ఉద్యమించాలి.
స్కాలర్ షిప్స్,మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకనుగుణంగా పెంచి సకాలంలో విడుదల చేయాలి.
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లను రద్దు చేయాలి.
ఇంజనీరింగ్,వైద్య విద్యలో డొనేషన్ల రద్దుకై ఉద్యమించాలి.
విద్యాలయలలో కులం,మతతత్వం,లింగ వివక్ష, మూఢాచారాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలి ..
ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయాలి. బీసీ సబ్ ప్లాన్ చట్టం చెయ్యాలని తీర్మానాలు చేయడం జరిగింది.

రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని వర్గాల ప్రజలు,విద్యార్థులు, ప్రజాసంఘాలు, మేధావులు, మీడియా మిత్రులకు పీడీఎస్ యూ రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది .

ఈ కార్యక్రమం లో పీడీ ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షలు నరసింహ రావు నరేందర్ శివ సహాయ కార్యదర్శులు వెంకటేష్, వీరబాద్రం రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, శశి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు?

Ram Narayana

నీటి చుక్క కూడా తెలంగాణ వాటా వదులుకునే ప్రసక్తే లేదు…. డిప్యూటీ సి.ఎం. భట్టి

Ram Narayana

సీఐ వేధింపులకు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..!

Ram Narayana