ఆంధ్రప్రదేశ్

ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్…

  • ఎక్కువ ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమన్న పవన్
  • ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశం

ఏపీలో పలుచోట్ల వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు తనకు అందాయని చెప్పారు. 

ఇలాంటి అమ్మకాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పవన్ చెప్పారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని… ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఉంచాలని… అధిక ధరలకు మద్యం విక్రయించే దుకాణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధింత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు తావు ఉండటానికి వీల్లేదని అన్నారు. ప్రజల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వానికి ప్రధానమని చెప్పారు.

Related posts

సర్జికల్ బ్లేడ్ శరీరంలోనే వదిలేసి కుట్లేసిన వైద్యుడు… మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం!

Ram Narayana

ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం: పిడుగుపాటుకు ఆరుగురు రైతులు బలి!

Ram Narayana

ఆసియాలోనే పొడవైన డబుల్ డెక్కర్‌గా విశాఖ మెట్రో!

Ram Narayana