తెలంగాణ రాజకీయ వార్తలు ..

పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం…

  • ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ ను కొట్టేసిన స్పీకర్
  • సరైన ఆధారాలు లేవని పేర్కొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్
  • సంజయ్ పై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. సంజయ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అధికార కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన స్పీకర్.. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాజాగా సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.

Related posts

ప్రశ్నించినందుకే రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదు: కేసీఆర్‌పై కడియం శ్రీహరి

Ram Narayana

మనం ఎన్నుకున్న సర్పంచి గ్రామంలో లేకుంటే ఎలా ఉంటుంది?: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది: రేవంత్ రెడ్డి

Ram Narayana