- మండెలగూడం నుంచి నర్మెట్ట మండలం అమ్మాపూర్ గ్రామానికి వెళ్లిన పులి
- రెండు లేగదూడలను చంపిన పెద్ద పులి
- పాదముద్రల ఆధారంగా పులి కోసం గాలిస్తున్న అటవీ శాఖ అధికారులు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో కలకలం రేపిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులి జనగామ జిల్లా మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆలేరు, జనగామ జిల్లాలోని రఘునాథ్‌పల్లి, మండెలగూడెం, ఖిలాషాపూర్, మచ్చుపహాడ్, మేకలగట్టు గ్రామాల్లో కలకలం రేపింది.
అటు నుంచి నర్మెట్ట మండలం అమ్మాపూర్ గ్రామంలోకి ప్రవేశించిన పులి గ్రామంలో రెండు దూడలను చంపినట్లు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పోలీసులు, అటవీ శాఖ అధికారులు పులి కోసం గాలిస్తున్నారు. ఇక్కడి నుంచి అది సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. పులి సంచరిస్తున్న మండలాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: