జాతీయ వార్తలు

పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో అమెరికాలో భారతీయుడి అరెస్టు…

  • సరైన పత్రాలు లేకుండా అతడు దేశంలోకి ప్రవేశించినట్లు వెల్లడి
  • నిందితుడిని న్యూజెర్సీలో అరెస్టు చేసినట్లు పేర్కొన్న అధికారులు
  • దొంగతనం, శాంతిభద్రతలకు సంబంధించిన నేరాలతోనూ సంబంధం

పిల్లలపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి అమెరికాలో ఒక భారతీయుడుని అరెస్ట్ చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లి అనే ఈ నిందితుడు సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించాడని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. నిందితుడిని న్యూజెర్సీలో అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు.

13 సంవత్సరాల లోపు మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అతడిని దేశం నుంచి బహిష్కరించేందుకు న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Related posts

కేంద్ర మంత్రి హెలికాఫ్టర్ కు ఇంధనం కొరత.. రోడ్డు మార్గంలో ప్రయాణించిన రాజ్ నాథ్

Ram Narayana

ఆ వ్యక్తికి సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసుతో సంబంధం లేదు: ముంబై పోలీసుల కీలక ప్రకటన!

Ram Narayana

జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ నివేదిక రాష్ట్రపతికి, ప్రధానికి సమర్పణ

Ram Narayana