ఆఫ్ బీట్ వార్తలు

వ్యూస్’ పిచ్చి పతాకస్థాయికి.. భార్య ప్రసవ వేదనను లైవ్ పెట్టిన భర్త!

  • భార్య ప్రసవ వేదనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైనా ఇన్‌ఫ్లుయెన్సర్
  • ఆమె ప్రాణాలతో పోరాడుతుంటే.. వీడియో మధ్యలో న్యాపీల యాడ్ చెప్పిన భర్త
  • తీవ్ర విమర్శలతో వెల్లువెత్తిన ఆగ్రహం.. షేమ్‌లెస్ అంటూ నెటిజన్ల ఫైర్
  • నిబంధనలు ఉల్లంఘించినందుకు డౌయిన్, వీబో ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం

వ్యూస్, డబ్బు కోసం కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ చైనా ఇన్‌ఫ్లుయెన్సర్లు తన భార్య ప్రసవ వేదనను వీడియో తీసి, ఆమె ప్రాణాలతో పోరాడుతున్న సమయంలోనూ యాడ్స్ ప్రమోట్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అతడి ఖాతాలను నిషేధించాయి.

అమెరికాలోని సియాటెల్‌లో నివసించే చైనాకు చెందిన ‘పాల్ ఇన్ యూఎస్ఏ’ (అసలు పేరు జౌ జావో) ఓ ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లు. అతడికి డౌయిన్ ప్లాట్‌ఫామ్‌పై 12.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల తన భార్య 23 గంటల పాటు పడిన ప్రసవ వేదనను అతను వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం (3,344 ml) కావడంతో అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.

అయితే, భార్య ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో కూడా పాల్ కెమెరా ఆపలేదు. పైగా, ఆ వీడియో మధ్యలో న్యాపీల కోసం ఓ పెయిడ్ యాడ్ స్క్రిప్ట్‌ను చదివి వినిపించాడు. ఈ వీడియో బయటకు రావడంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. భార్య అంతటి బాధలో ఉంటే డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు.

ఈ ఘటనపై తన భార్య ఫిబ్రవరి 10న స్పందిస్తూ.. ప్రసవంలో ఉండే రిస్క్‌లను తెలియజేయడానికే ఈ వీడియో తీశామని వివరణ ఇచ్చింది. అయితే, ప్రజాగ్రహం చల్లారకపోవడంతో నిబంధనల ఉల్లంఘన కింద డౌయిన్, వీబో ప్లాట్‌ఫామ్స్ ఫిబ్రవరి 11న అతడి ఖాతాలను నిషేధించాయి. ఈ వివాదం చైనాలో ఆన్‌లైన్ కంటెంట్ నైతిక విలువలపై పెద్ద చర్చకు దారితీసింది.

Related posts

‘టోక్యో’ నగరానికి ఏమైంది?.. అక్కడి మహిళలు ఎందుకిలా మారిపోతున్నారు?

Ram Narayana

నులక మంచం, చేతి పంపు.. భారత పల్లెటూరికి అమెరికా కుర్రాడు ఫిదా..

Ram Narayana

త‌ల్లిని ఇంట్లో బంధించి.. పుణ్యం కోసం కుంభ‌మేళాకు వెళ్లిన పుత్ర‌ర‌త్నం!

Ram Narayana