ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యి వ్యవహారం ఆయనదొక మాట …ఈ యనదొకమాట …

ఇది మహాపచారం… గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం: కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Ghee Adulteration Scandal in TTD
  • టీటీడీ నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందన్న సీఎం చంద్రబాబు
  • పక్కా ప్రణాళికతో నిబంధనలు మార్చి అనర్హులైన సంస్థలకు టెండర్లు
  • జంతువుల కొవ్వు, రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని ఆరోపణ
  • సిట్ నివేదికలోని అంశాలను, ఆధారాలను అసెంబ్లీలో బయటపెట్టిన ముఖ్యమంత్రి
  • టీటీడీ చైర్మన్ పీఏ ఖాతాలో రూ.4.69 కోట్ల లంచం డబ్బు దొరికిందన్న చంద్రబాబు

ఇది మహాపచారం… గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం: కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Ghee Adulteration Scandal in TTD
  • టీటీడీ నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందన్న సీఎం చంద్రబాబు
  • పక్కా ప్రణాళికతో నిబంధనలు మార్చి అనర్హులైన సంస్థలకు టెండర్లు
  • జంతువుల కొవ్వు, రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని ఆరోపణ
  • సిట్ నివేదికలోని అంశాలను, ఆధారాలను అసెంబ్లీలో బయటపెట్టిన ముఖ్యమంత్రి
  • టీటీడీ చైర్మన్ పీఏ ఖాతాలో రూ.4.69 కోట్ల లంచం డబ్బు దొరికిందన్న చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందని, ఇది దేవుడికే అపచారం చేసిన మహా పాపమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికలో సంచలన విషయాలు ఆధారాలతో సహా ఉన్నాయని అన్నారు. పక్కా ప్రణాళికతో, వ్యవస్థీకృతంగా ఈ స్కామ్‌కు పాల్పడ్డారని, శ్రీవారి నైవేద్యానికి వాడే నెయ్యిని ప్రమాదకరమైన రసాయనాలు, జంతువుల కొవ్వుతో కల్తీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడి విషయంలో జరిగిన ఈ మహా పాపంపై గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకుండా, బుకాయించడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.

నిబంధనల మార్పుతో మొదలైన కుట్ర 
ఈ కుంభకోణానికి బీజం టెండర్ నిబంధనల మార్పుతోనే పడిందని చంద్రబాబు వివరించారు. తమకు అనుకూలమైన, అనర్హత ఉన్న సంస్థలకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు గత ప్రభుత్వం నిబంధనలను పూర్తిగా నీరుగార్చిందని ఆరోపించారు. 

రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలనే నిబంధనను పూర్తిగా తొలగించారు. నెయ్యి తయారీలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించారు. డైరీల వార్షిక టర్నోవర్‌ను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్ వంటి కీలక ప్రక్రియలకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. ఈ మార్పులతో అర్హత లేని ‘బోలే బాబా’, ‘వైష్ణవి డైరీ’ వంటి షెల్ కంపెనీలకు నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించారని సీఎం పేర్కొన్నారు.

జంతువుల కొవ్వు, డిటర్జెంట్లతో కల్తీ 
సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని, అది రసాయనాల మిశ్రమమని సిట్ నివేదికలోని అంశాలను చంద్రబాబు ఉటంకించారు. నెయ్యి తయారీకి రిఫైన్డ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్‌ను బేస్‌గా వాడారని తెలిపారు. రంగు కోసం ‘బీటా కెరాటిన్’, వాసన కోసం ‘ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్’, నురుగు కోసం డిటర్జెంట్లలో వాడే ‘లబ్సా యాసిడ్’ వంటి ప్రమాదకర రసాయనాలు వాడినట్లు వెల్లడించారు. 

అంతేకాకుండా, 2024 జూలైలో వచ్చిన ఎన్డీబీ నివేదిక ప్రకారం నెయ్యిలో జంతువుల కొవ్వు (బీఫ్ టాలో) అవశేషాలు ఉన్నట్లు తేలిందని, ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల లంచాలు, నివేదికల తొక్కివేత
 ఈ మొత్తం వ్యవహారంలో భారీగా లంచాలు చేతులు మారాయని చంద్రబాబు ఆరోపించారు. అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో రూ.4.69 కోట్ల లంచం డబ్బును సిట్ గుర్తించిందని తెలిపారు. కిలో నెయ్యికి రూ.25 చొప్పున చిన్నపన్న కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. 

ప్లాంట్ తనిఖీలకు వెళ్లిన అధికారులకు ఖరీదైన ఫోన్లు, బంగారం, వెండి నాణేలు లంచంగా ఇచ్చి అనుకూల నివేదికలు తెచ్చుకున్నారని అన్నారు. 2022లోనే సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ అని (బీటా సిటోస్ట్రాల్ పాజిటివ్) స్పష్టంగా ఉన్నా, అప్పటి టీటీడీ బోర్డు ఆ నివేదికను తొక్కిపెట్టిందని చంద్రబాబు ఆరోపించారు. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినప్పటికీ ‘బోలే బాబా’ సంస్థ ‘వైష్ణవి’, ‘మాల్గంగ’ వంటి షెల్ కంపెనీల ద్వారా కల్తీ నెయ్యి సరఫరాను కొనసాగించిందని వివరించారు.

సిట్ దర్యాప్తులో భాగంగా నకిలీ ల్యాబ్ రిపోర్టులు, ఫేక్ ఇన్వాయిస్‌లు, లంచాల వివరాలున్న డైరీలు, రసాయనాల డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులో నేరపూరిత కుట్ర (120బి), ఆహార కల్తీ (272, 273), మోసం (420), మత మనోభావాలను దెబ్బతీయడం (295a), అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చంద్రబాబు సభకు వివరించారు. 

కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీలో రసవత్తర చర్చలు జరుగుతున్నా యి. పాపం మీదంటే మీదేనని విమర్శలు గుప్పించుకుటూ దేవుడి ప్రసాదంపై అనుమానాలు బలంగా రేకెత్తిస్తున్నారు ..ఇది భక్తుల మనోభావాలకు సంబందించిన అంశం అయినందున ఎవరు అటు వైపు ఆలోచించడంలేదు .పైగా రాజకీయంగా ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు ..

పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ తాను గత ప్రభుత్వ అధినేత తప్పు చేశాడని ఎప్పుడు అనలేదని పేర్కొనడం విశేషం. పవన్ మాటలతో తెలుగుదేశం సభ్యులు ఒక్కసారిగా అవాక్కు అయ్యారు ..అరే పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నారని ఉలిక్కి పడ్డారు ..ఆ తర్వాత ఆయన జరిగిన పరిణామాలపై మాట్లాడారు ..

చంద్రబాబు నాయుడు మాత్రం మొదటి నుంచి నెయ్యిలో కల్తీ జరిగిందని అంటున్నారు .దీనిపై అన్వేషించాలన్నారు.. అందుకోసమే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినట్లు సమర్ధించుకుంటున్నా రు. అయితే గతంలో లాగా చంద్రబాబు నాయుడు నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు , చేప నూనె కలిసుందని చెప్పడం లేదు. గతంలో ఎందుకు చెప్పారు…ఇప్పుడు ఎందుకు మాట మార్చుకున్నారు అనేది నేడు చర్చనీయాంశంగా మారింది…

 గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని నేనెప్పుడూ చెప్పలేదు: కల్తీ నెయ్యి వ్యవహారంపై పవన్ కల్యాణ్

Pawan Kalyan Clarifies on Tirumala Ladoo Ghee Adulteration Allegations
  • తిరుమల లడ్డూ నెయ్యి కల్తీకి గత టీటీడీ పాలకమండలే పూర్తి బాధ్యత వహించాలన్న పవన్
  • నెయ్యిలో పాలు లేవని, రసాయనాలతో తయారు చేశారని సిట్ నివేదిక తేల్చిందని వెల్లడి
  • తమకు నచ్చిన సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు టెండర్ నిబంధనలు మార్చారని ఆరోపణ
  • హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు అందరూ ఏకతాటిపై ఖండించాలని పిలుపు

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను ఎప్పుడూ నిందించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆనాడు నియమితులైన టీటీడీ పాలకమండలిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, దోషులను వెనకేసుకు రాకుండా, చట్ట ప్రకారం విచారణకు సహకరించాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నివేదికను ప్రస్తావించిన తర్వాతే తనకు పూర్తి వివరాలు తెలిశాయన్నారు.

పాల చుక్క లేకుండా రసాయనాలతో నెయ్యి

సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికలోని అంశాలను పవన్ కల్యాణ్ సభలో వివరించారు. లడ్డూల కోసం వినియోగించిన 68 లక్షల కిలోల నెయ్యిలో పాల చుక్క కూడా లేదని, పామాయిల్, ప్రమాదకర రసాయనాలతో దాన్ని తయారు చేశారని సిట్ తేల్చి చెప్పిందన్నారు. ఈ కేసులో 36 మందిని నిందితులుగా చేర్చారని, ఇది శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రగా సిట్ అభివర్ణించిందని తెలిపారు. 2019-24 మధ్య కాలంలో విక్రయించిన 48 కోట్ల లడ్డూలలో సుమారు 20 కోట్ల లడ్డూలు ఈ నకిలీ నెయ్యితోనే తయారయ్యాయని టీటీడీ రికార్డులు చెబుతున్నాయని, తద్వారా 11 కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి పంపిన లక్ష లడ్డూలు కూడా ఈ కల్తీ నెయ్యితో చేసినవేనని ఆయన పేర్కొన్నారు.

టెండర్ నిబంధనల మార్పుతోనే కుట్ర

గత ప్రభుత్వ హయాంలో తమకు నచ్చిన సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలను నీరుగార్చారని పవన్ ఆరోపించారు. నెయ్యి సరఫరా చేసే సంస్థకు ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్‌ను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారని, రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనను తొలగించారని, మూడేళ్ల అనుభవాన్ని ఏడాదికి కుదించారని వివరించారు. ఈ మార్పుల తర్వాత కాంట్రాక్టు దక్కించుకున్న ‘బోలే బాబా’, ‘వైష్ణవి డైరీస్’ వంటి సంస్థలకు కనీస అర్హతలు కూడా లేవని సిట్ చార్జిషీట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు.

ఇది హిందూ ధర్మంపై దాడి

ఈ వ్యవహారంపై తాను స్పందించకపోవడం పట్ల పశ్చాత్తాపంతోనే దీక్ష చేశానని పవన్ గుర్తుచేసుకున్నారు. ఇది కేవలం కల్తీ వ్యవహారం కాదని, హిందూ ధర్మంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. “ఇదే ఘటన ఏ ఇతర మతానికి జరిగినా దేశం, ప్రపంచం గగ్గోలు పెట్టేవి. హిందువులు కులాల పేరుతో విడిపోయి ఉండటం వల్లే మన ధర్మంపై దాడులు జరుగుతున్నప్పుడు తీవ్రత ఉండటం లేదు. ఇతర మతాల వారి ఐక్యతను చూసి మనం నేర్చుకోవాలి,” అని అన్నారు. తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న వారు తిరుమల వెళ్లి ఆ స్వామి కళ్లలోకి ఎలా చూడగలరని ప్రశ్నించారు.

శ్రీకృష్ణదేవరాయులు తన ఆముక్త మాల్యదలో చెప్పిన పద్యాన్ని ఉటంకిస్తూ, దేవుడి సొమ్ముపై ఆశ ఉన్నవారికి ఆలయ అధికారం ఇవ్వరాదని, అలా ఇస్తే రాజ్యమే నాశనమవుతుందని ఆ పద్యం చెబుతోందని, గత ప్రభుత్వంలో సరిగ్గా అదే జరిగిందని పవన్ విమర్శించారు. ఈ పాపానికి పాల్పడిన దోషులు ఎవరైనా వారికి శిక్ష పడాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఏకకంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం ..బావిలోకి దూసుకువెళ్లిన కారు .. ముగ్గురు మృతి

Ram Narayana

పదవిలో ఉన్నప్పుడు కాదు.. ఇప్పుడే నేను మరింత ప్రమాదకారిని: ఇమ్రాన్ ఖాన్!

Drukpadam

వేలాది మంది సమక్షంలో డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ అపర్ణ ల ఎంగేజిమెంట్ !

Drukpadam