తెలుగు రాష్ట్రాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్ జే దొర మృతి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్ జే దొర మృతి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్ జే దొర కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన సన్నిహితులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఈయన డీజీపీగా పనిచేశారు. గ్రేహౌండ్స్ దళాన్ని బలోపేతం చేయడంలో మరియు నక్సలిజంపై వ్యూహాత్మక పట్టు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సాంకేతికతను ప్రవేశపెట్టడం, కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి సంస్కరణలకు ఆయన నాంది పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఐదున్నర ఏళ్లకు పైగా డీజీపీగా పనిచేసిన అరుదైన రికార్డు ఆయన సొంతం. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఈయన అత్యంత నమ్మకస్తుడైన అధికారిగా ఉండేవారు. డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత, ఈయన కేంద్ర నిఘా విభాగంలో విజిలెన్స్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు.

Related posts

ఐబొమ్మ రవిని వారం రోజుల్లో బెయిల్‌పై తీసుకొస్తా: వైజాగ్ న్యాయవాది సలీం!

Ram Narayana

రామోజీరావు దార్శనికుడు.. ప్రశంసల వర్షం కురిపించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.. ఫొటోలు ఇవిగో!

Ram Narayana

హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై పోలీస్ కేసు నమోదు

Ram Narayana