వెలుగుమట్ల ఎపిసోడ్ … హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ…
భూదాన్ భూములపై తెలంగాణ హై కోర్టు స్టేటస్ కో
అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులు అందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన బాధితులు
దీంతో 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశం
భూదాన్ భూములపై యధాస్థితి కొనసాగించాలని ఆదేశించిన కోర్టు
స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తాహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లకూల్చివేత ప్రభుత్వాన్ని వెంటాడుతుంది … హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది .అక్కడ కూల్చివేతలను కోర్ట్ తీవ్రంగా పరిగణించింది .. బాధితులందరికీ అక్కడే ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది . పేదల ఇళ్లపై ప్రతాపం ఏమిటని ప్రభుత్వ చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి . హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది … కూల్చివేతలపై తీవ్ర విమర్శలను ఎదుర్కొని డామేజ్ కంట్రోల్ చేసుకొనే పనిలో భాగంగా తిరిగి అర్హలైన పేదలకు అక్కడే ఇల్లు ఇచ్చేందుకు నిర్ణయించుకున్న ప్రభుత్వం 311 మందికి ఇళ్లస్థలాలు ఇచ్చింది …మరో 101 మందికి వారి వారి మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరి చేసింది ..అయితే కూల్చివేతలపై కోర్టుకు వెళ్లిన భాదితులకు ఊరట నిచ్చేలా హైకోర్టు స్టే ఇచ్చింది ..అర్హులైన అందరికి అక్కడే ఇల్లు నిర్మించాలని కోర్ట్ ఆదేశించింది . ఇల్లు నిర్మించుకున్న వారిపై కర్కశంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టినట్లుయింది .ఇది ఒక రకంగా భాదితులను అండగా ఉన్నట్లు కోర్ట్ చెప్పకనే చెప్పింది . అక్కడ కూల్చివేసిన నిర్వాసితులందరికి అక్కడే ఇల్లు ఇవ్వాలని చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టులా అయింది . ఇప్పటికే జిల్లా మంత్రుల ప్రమేయం ఉందని వారి ఆదేశాల మేరకు కూల్చివేతలు జరిగాయని విమర్శలు ఉన్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 760 ఇళ్లను కూల్చటంతో రాష్ట్ర వ్యాపితంగా నిర్వాసితులకు మద్దతు లభించింది ..రాజధాని హైద్రాబాద్ తో సహా అన్ని చోట్ల ఇదే చర్చ జరిగింది …ప్రభుత్వ చర్యలను సొంత పార్టీలోని వారే తప్పు పడుతున్నారు .ఎవరో ఒకరిద్దరి కోసం పేదల ఉసురు పోసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి .. జిల్లా మంత్రుల బీనామీలే అక్కడ భూములు కొన్నారని కొన్న భూములకు తోడు పేదలు వాళ్ళను ఖాళీ చేయించడం ద్వారా వాటిని కూడా దక్కించుకోవాలని కుట్రలు పన్నారని ఆరోపణలు ఉన్నాయి… ఎట్టకేలకు భాదితులు కోర్ట్ తలుపు తట్టడంతో వారికీ అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది ..అర్హులైన వారికీ 311 మందికి అక్కడే ఇళ్లస్థలాలు ఇచ్చామని ప్రభుత్వం కోర్టుకు తెలిపినప్పటికీ , అక్కడ కూల్చివేసిన అందరికి న్యాయం చేయాలనీ హైకోర్టు చెప్పింది ..దీనిపై భూదాన్ భూముల్లో ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓ కు తహసీల్దార్ కు నోటీసులు జారీచేసింది …మరి ప్రభుత్వం కోర్ట్ ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి …!