జాతీయ రాజకీయ వార్తలు

రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు…

పవిత్ర రంజాన్ పర్వదినం వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న ఆమె, ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణ పేరుతో మైనార్టీల ఓటు హక్కును కాలరాస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని, ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ తొలగింపులు జరిగాయని ఆమె పేర్కొన్నారు. “మోదీ కానీ, బీజేపీ కానీ మీ ఓటు హక్కును దొంగిలించనివ్వను. ప్రజాస్వామ్యాన్ని, పౌరుల హక్కులను కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతాను” అని ఆమె అన్నారు.

ఓటర్ల జాబితా సవరణ విషయంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. వెరిఫికేషన్ సాకుతో అర్హులైన వారిని జాబితా నుంచి తొలగించడం ద్వారా బీజేపీకి లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారంటూ ఎన్నికల సంఘంపై మమత విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగాల్‌ను టార్గెట్ చేసి, రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న వారు ‘నరకానికి’ వెళతారంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తారు. ఈ సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం” అని మమత స్పష్టం చేశారు. బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసే శక్తులకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.

Related posts

మోదీని మహాత్మాగాంధీతో పోల్చిన ఉప రాష్ట్రపతి.. ఇంతకుమించి సిగ్గులేనితనం మరోటి ఉండదన్న కాంగ్రెస్

Ram Narayana

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్మగ్లర్ వీరప్పన్ కూతురు

Ram Narayana

డీఎంకే అవినీతి అక్రమాలపై ప్రజలు తిరగబడతారు …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి

Ram Narayana