
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఈరోజు కలిశారు. కేసీఆర్ ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఆలింగనం చేసుకుని, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారులు, జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కూడా ఆయనతో పాటు ఉన్నారు.
పాత మిత్రులు కలవడంతో అక్కడ ఎంతో ఆత్మీయ వాతావరణం నెలకొంది. కేసీఆర్‌ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను దేవుడే మీ దగ్గరికి పంపాడు, మీతో కలిసి పనిచేయమని కోరాడు” అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చాలా కాలం తర్వాత ఇన్నాళ్లకు కలిసి పనిచేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అంతకు ముందు, ఎర్రవెల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్

కేసీఆర్ తో జీవన్ రెడ్డి లంచ్ మీట్ …
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ aయ్యారు . సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగే ఈ సమావేశం కోసం జీవన్ రెడ్డికి మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు .. ఈ భేటీలో బీఆర్ఎస్లో చేరే తేదీతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు .
మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్.., మాజీమంత్రి జీవన్ రెడ్డి పరస్పర ఆలింగనం.., ఆత్మీయ సంభాషణ…
ఈనెల ఏప్రిల్ 20న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిజగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ…జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ..త్వరలో కరీంనగర్ నుండి భారీగా చేరికలు
జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు కొప్పుల ఈశ్వర్, ఎల్. రమణ, దామోదర్ రావు, గంగుల కమలాకర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరైయ్యారు .
అంతకుముందు గురువారం, కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నేతలతో కలిసి గంటకు పైగా జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌తో జీవన్ రెడ్డికి మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు.