Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాయాలను గెలిపించాలి :పోట్ల

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాయాలను గెలిపించాలి :పోట్ల
-కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు
-స్థానిక సంస్థలను ప్రతినిధులు ఆలోచించాలి
-మీడియా సమావేశంలో వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ జావిద్ .

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న రాయల నాగేశ్వర్ రావు ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్ రావు పిలుపు నిచ్చారు. నేడు ఖమ్మం కలెక్టరేట్ లో రాయల నాగేశ్వర్ రావు నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ , జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పూవాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించటం ద్వారా మాత్రమే కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందిచవచ్చునని అన్నారు. కేసీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థిలో ప్రజలు లేరని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయని , ఎన్ని కోట్లు ఖర్చు చేసిన టీఆర్ యస్ ఓడిపోయిన విషయాన్నీ గమనించాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ , పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్కల ఆదేశానుసారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావుకు బిఫామ్ ను జారీ చేశారని అన్నారు . కాంగ్రెస్ ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు జావిద్ అన్నారు . గతంలో 2009వ సంవత్సరం లో ప్రజారాజ్యం పార్టీ నుండి పాలేరు అభ్యర్థిగా పోటీ చేశారని , 2010వ సంవత్సరంలో పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారని , అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పని చేశారని పేర్కొన్నారు . టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు . ప్రజా ప్రతినిధులు ఎక్కువశాతం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికిని , ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ , ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ , ఓటర్లను బెదిరిస్తూ పోలీస్ శాఖ వారి అండదండలు చూస్తూ విర్రవీగుతున్నారని జావేద్ ధ్వజమెత్తారు . టీఆర్ఎస్ పార్టీ పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు , కాంగ్రెస్ వల్లనే ప్రజాస్వామ్యాన్ని మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. అధికార దాహంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఉపయోగించి ఓటర్లను , అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున ఓటర్లు , అభ్యర్థులు మనోధైర్యంతో ఉండి వారి పై పెట్టుకున్న నమ్మకాన్ని , కర్తవ్యాన్ని నెరవేర్చాలని సూచించారు . ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ ,కాంగ్రెస్ నాయకులు ముదిగొండ సోసైటి డైరెక్టర్ వనం ప్రదీప్త బాబు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ జె బాలశౌరి , జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మోతుకూరి ధర్మారావు , వీరాపురం రామలక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు .

Related posts

రాజకీయ సలహాలకోసం ఉండవల్లిని కలిసిన బ్రదర్ అనిల్ !

Drukpadam

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు;వర్గీకరణ న్యాయసమ్మతమే: మ‌ధు యాష్కీ గౌడ్‌

Drukpadam

ఈటలతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భేటీ!

Drukpadam

Leave a Comment