Gaddar Awards
ఎంటర్టైన్మెంట్ వార్తలు

గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి ముహూర్తం ఫిక్స్

  • జూన్ 14న ‘గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు’ ఇవ్వాలనినిర్ణయం
  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటి రెడ్డితో జ్యూరీ సభ్యుల భేటీ

జూన్ 14న ‘గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన14 సంవత్సరాల తరువాత ఈ అవార్డులను అందజేయబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రముఖ సినీనటి జయసుధ అధ్యక్షతన 15 మందితో కూడిన జ్యూరీ కమిటిని ఏర్పాటు చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ పొందిన ఉత్తమ తెలుగు చలన చిత్రాలకు (సంవత్సరానికి ఒక చిత్రానికి) ‘గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు అందజేస్తారు. ఈ సమావేశంలో జయసుధతో పాటు టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్తదితరులు పాల్గొన్నారు.

Related posts

బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి..

Ram Narayana

జపనీస్ ఫ్యాన్ అచ్చతెలుగులో మాట్లాడ‌టం చూసి షాకైన బన్నీ, రష్మిక..!

Ram Narayana

రెండవ పెళ్ళికి సిద్ధమవుతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి..!

Ram Narayana