Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి:టి యూ డబ్ల్యూ జె ( ఐ జె యూ )

జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి
◆ ఉండవెళ్లి జర్నలిస్టుపై జరిగిన దాడి హేమమైన చర్య ….
◆ జర్నలిస్ట్ ల పక్షాన టి యూ డబ్ల్యూ జె ( ఐ జె యూ ) ఎల్లప్పుడు అండగా ఉంటుంది
◆ ఎం ఎల్ సి కసి రెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రాన్ని అందజేసిన జర్నలిస్టులు
◆టి యూ డబ్ల్యూ జె ( ఐ జె యూ ) జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్

వనపర్తి :
జోగులాంబ గద్వాల్ జిల్లా, ఉండవెల్లి నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, రిమాండ్ పంపాలని టి యూ డబ్ల్యూ జె ( ఐ జె యూ ) జిల్లా అధ్యక్షుడు. గుండ్రాతి మధు గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు . సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో టి యూ డబ్ల్యూ జె ( ఐ జె యూ ) పట్టణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులతో కలిసి ఆయన ఎం ఎల్ సి కసి రెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రాన్ని అందచేశారు . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు. గుండ్రాతి మధు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేటటువంటిది జర్నలిస్టు వృత్తి అని, అలాంటి వృత్తిలో సేవలు అందించే జర్నలిస్టులపై దాడులు జరగడం హేమమైన చర్య అని ఖండించారు. జర్నలిస్టుపై దాడి చేయడం సమజానికే సిగ్గు చేటని మండిపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిజానికి మరింత గౌరవం పెరుగుతుందని ఆశించాము కానీ దురదృష్టవశాత్తు సమాజంలోని కొన్ని దుష్ట శక్తులు జర్నలిస్టులపై దాడి చేయడం సమజానికే చెడ్డపేరు వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా సేవా భావంతో పనిచేసే జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
◆ సీఎం కే స్వయంగా వినతిపత్రం అందజేస్తా: ఎం ఎల్ సి కసి రెడ్డి నారాయణరెడ్డి
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం జర్నలిస్టుల సంక్షేమం కోసం, సమస్యల గురించి కృషి చేస్తున్నారని, కానీ జర్నలిస్టుపై జరిగిన దాడిని ప్రభుత్వం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఎం ఎల్ సి కసి రెడ్డి నారాయణరెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా, ఉండవెళ్లి నమస్తే తెలంగాణ జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మీరిచ్చిన వినతిపత్రాన్ని స్వయంగా సీఎం. కేసీఆర్ గారికి అందజేసి, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూస్తామని జర్నలిస్టులకు ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. బొలేమోని రమేష్, సీనియర్ జర్నలిస్టులు పౌర్ణరెడ్డి, మాధవరావు, రాము,జర్నలిస్టుల యూనియన్ పట్టణ అధ్యక్షుడు. బొడ్డుపల్లి లక్ష్మన్, ప్రధానకార్యదర్శి.మన్యం, కోశాధికారి. సిల్ మార్తి.ఆంజనేయులు, జర్నలిస్టులు దినేష్, హరీష్, సిరాజ్, తిరుపతి, ఫోటో జర్నలిస్టులు వినోద్, బాలరాజు, తరుణ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తర–దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం!

Drukpadam

రష్యా ప్రాదేశిక జలాల్లోకి అమెరికా జలాంతర్గామి…

Drukpadam

జర్మనీ అధీనంలో భారతీయ బాలిక.. స్వదేశానికి పంపించాలంటూ కేంద్రం ఒత్తిడి…

Drukpadam

Leave a Comment