Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా లెక్కల్లో తెలంగాణ సర్కార్ అంకెల గారడీ …50 వేల పరిహారంతో ప్రజల గగ్గోలు!

కరోనా లెక్కల్లో తెలంగాణ సర్కార్ అంకెల గారడీ …50 వేల పరిహారంతో ప్రజల గగ్గోలు!
-కరోనా మృతులపై తెలంగాణ సర్కారు అంకెలు వేరు.. వాస్తవాలు వేరు..!
-జనవరి 7 నాటికి మృతులు 4,039
-పరిహారం కోసం వచ్చిన దరఖాస్తులు 26,000
-రికార్డులకు ఎక్కని మరణాలు చాలానే ఉన్నాయ్
-ఆసుపత్రికి తరలిస్తుండగా బలైన వారు ఎందరో
-ఇంకా ఎన్ని దరఖాస్తులు వస్తాయో
-ఆన్ లైన్ కానీ కేసుల బంధువుల ఆందోళన
-జుట్టు పట్టుకుంటున్న స్థానిక సిబ్బంది

కరోనా లెక్కల విషయంలో తెలంగాణ సర్కార్ చేసిన నిర్వాహకం ఇప్పడు ఇబ్బందిగా మారింది. లెక్కడ గారడీ చేసి తమదగ్గర కేసులు తక్కువ ఉన్నాయని నమ్మబలికిన సర్కార్ కు ఎదురుదెబ్బ తగలక తప్పటంలేదు . అనేక కేసులు దాచిపెట్టాలని అప్పట్లో జిల్లాలకు రాష్ట్ర కేంద్రం నుంచే సూచనలు రావడంతో వేలల్లో కేసులు వచ్చిన కేవలం వందల్లోనే ఉన్నాయని ప్రకటించిన సందర్భాలు అనేకం ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఇప్పడు కేంద్రం ప్రకటించిన కరోనా మృతులకు 50 వేల పరిహారం నమోదు కానీ కేసులకు వచ్చే అవకాశం లేదు . దీంతో భాదిత బంధువులు ఆయన మండల కేంద్రాల్లోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలవద్ద తమపేర్లు ఎందుకు ఆన్ లైన్ చేయలేదని గొడవకు దిగుతున్నారు. దీంతో స్థానిక సిబ్బంది తలలు పట్టు కుంటున్నారు . తెలంగాణ ప్రభుత్వం జనవరి 7 నాటికీ 4039 మరణాలు రాష్ట్రంలో జరిగినట్లు కేంద్రానికి రిపోర్ట్ పంపగా వస్తాం ఇందుకు విరుద్ధంగా ఉంది . ఇప్పటికి కరోనా భారిన పడిన పాజిటివ్ కేసులు స్థానిక ఆరోగ్య కేంద్రాల ద్వారా తీసుకున్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 26 వేలకు చేరింది. ఇంకా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కు బలైపోయిన వారి విషయంలో అధికారిక లెక్కలకు, వాస్తవాలకు పొంతన కుదరడం లేదు. సాధారణంగా ఇటువంటి అంశాల్లో నిజా, నిజాలు ఏంటన్నవి బయటకు రావు. కానీ, కరోనా విపత్తు విషయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించి ప్రభుత్వం రూ.50,000 పరిహారం ఇస్తుండడంతో వాస్తవ మృతుల సంఖ్య వెలుగులోకి వస్తోంది. దీంతో సర్కారు వారి లెక్కల కంటే చనిపోయిన వారు ఐదారు రెట్లు ఎక్కువే ఉన్నట్టు తెలుస్తోంది.

కరోనాతో 7వ తేదీ నాటికి తెలంగాణలో 4,039 మంది చనిపోగా.., జనవరి 7 నాటికి కోవిడ్ పరిహారం కోరుతూ 26,000 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. వీటిలో 12,000 దరఖాస్తులకు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన గల కమిటీలు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.

ప్రతీ సోమవారం అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని, జిల్లాలోని కమిటీలు వాటిపై నిర్ణయం తీసుకుంటున్నట్టు బొజ్జా తెలిపారు.ఎక్స్ గ్రేషియా నిబంధనలను సడలించడం వల్ల అధిక దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

బాధితుల కుటుంబ సభ్యులు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చనిపోయిన వారి మరణ ధ్రువీకరణ పత్రం, మరణానికి ముందు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్టుగా రిపోర్ట్, ఆధార్, దరఖాస్తు దారు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్ ఉంటే అప్లికేషన్ ను ఆమోదిస్తున్నట్టు అధికారులు బెతుతున్నారు.

ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించిన వారు, ఆస్పత్రికి తీసుకెళ్లిన వెంటనే ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు రికార్డుల్లోకి రాకపోవడమే దరఖాస్తులు ఎక్కువగా ఉండడానికి కారణంగా అధికారులు అంటున్నారు. సర్కారు వారి మృతుల లెక్కలకు మించి మరణాలు ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది.

Related posts

బాబోయ్.. భారత్ బెటర్ …. యూకేలో పరిస్థితి దారుణంగా ఉంది…

Drukpadam

ఈ నెల్లూరు అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు: సోనూ సూద్

Drukpadam

6 కోట్ల అస్ట్రాజెనికా టీకా డోస్ లను అందించనున్నాం : వైట్ హౌస్

Drukpadam

Leave a Comment