Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రూ.10 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో ఏడాదిలో కోటి ట‌ర్నోవ‌ర్‌!..

రూ.10 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో ఏడాదిలో కోటి ట‌ర్నోవ‌ర్‌!… పులివెందుల‌లో ‘జ‌గ‌న‌న్న మ‌హిళా మార్ట్”!

  • 10,200 మంది మ‌హిళ‌లు రూ.150 చొప్పున పొదుపు
  • రూ.10 ల‌క్ష‌ల‌తో పులివెందుల‌లో జ‌గ‌న‌న్న మ‌హిళా మార్ట్ ఏర్పాటు
  • మొత్తంగా మ‌హిళ‌ల‌తోనే నిర్వ‌హ‌ణ కొన‌సాగుతున్న వైనం

డ్వాక్రా సంఘాలు సాధిస్తున్న విజ‌యాల్లో మ‌రో విజ‌య గాథ చేరింది. కేవ‌లం రూ.10 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో మొద‌లైన ఓ మార్ట్ ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి ట‌ర్నోవ‌ర్ సాధించింది. ఈ విజ‌యగాథ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ఏర్పాటైన జ‌గ‌న‌న్న మ‌హిళా మార్ట్ గాథ‌. ఈ మార్ట్ విజ‌య గాథ‌ను ప్ర‌స్తావిస్తూ ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఓ వీడియోను శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

ఈ మార్ట్ పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. క‌డ‌ప జిల్లా ప‌రిధిలోని పులివెందుల‌లో 1,270 పొదుపు సంఘాలు ఉండ‌గా… వాటిలోని 10,200 మంది ఒక్కొక్క‌రు రూ.150 మేర పొదుపు చేసి రూ.10 ల‌క్ష‌ల‌ను స‌మ‌కూర్చారు‌. ఈ మొత్తంతో పులివెందుల‌లో జ‌గ‌న‌న్న మ‌హిళా మార్ట్ పేరిట ఓ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి టర్నోవ‌ర్‌ను సాధించింది. మొత్తం మ‌హిళ‌లలే నిర్వ‌హిస్తున్న ఈ మార్ట్ కార్పొరేట్ సంస్థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగానే రాణిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

jagananna mahila mart in pulilvendula which starts with 10 lack rupees achieved one crore tunrover in a year

Related posts

అత్యాచారం చేసిన కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష!

Drukpadam

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక!

Drukpadam

ఆప్ఘనిస్థాన్ లో తీవ్ర భూకంపం.. 1000 మందికి పైగా మృతి…

Drukpadam

Leave a Comment