Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు …ఎర్రజెండాలు వైఖరి !

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు …ఎర్రజెండాలు వైఖరి !
-మునుగోడుతో టీఆర్ యస్ తో పొత్తు ముగిసిందన్న సిపిఐ
-టీఆర్ యస్ తో కలిస్తే ఖమ్మం ,నల్గొండ జిల్లాల్లో క్లిన్ స్వీప్ అంటున్న సిపిఎం
-పాలేరు లో ఎర్రజెండా ఎగరవేస్తామంటున్న తమ్మినేని
-టీఆర్ యస్ తో సిపిఐ పొత్తు కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమంటున్న కూనంనేని

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో ఎర్రజెండాల వైఖరి ఏమిటి …ఎవరితో కలిసి పోటీచేస్తారు … టీఆర్ యస్ తోనా కాంగ్రెస్ తోనా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు…మునుగోడు ఉపఎన్నికల్లో అధికార టీఆర్ యస్ కు మద్దతు ప్రకటించిన కమ్యూనిస్టులు తిరిగి టీఆర్ యస్ తోనే కలిసి నడుస్తాయనే ప్రచారానికి అవకాశం ఏర్పడింది. అయితే ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న సిపిఎం ,సిపిఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం , కూనంనేని సాంబశివరావు లు మాటల్లో తేడాకనిపించడం గమనార్హం …సింగరేణి ఎన్నికల్లో టీఆర్ యస్ యూనియన్ తో కలిసి పోటీచేసే ప్రసక్తే లేదని చెప్పిన కూనంనేని మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్ యస్ తో పొత్తు ముగిసిందని అన్నారు . వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి పొత్తు ఎలావుంటుంది. ఎవరితో ఉంటుంది, అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు . అదే సందర్భంలో పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన తమ్మినేని వీరభద్రం టీఆర్ యస్ తో లెఫ్ట్ పార్టీలు కలిస్తే ఖమ్మం ,నల్గొండ జిల్లాల్లో క్లిన్ స్వీప్ చేస్తామని ,పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయమని అన్నారు . దీంతో సిపిఎం టీఆర్ యస్ తో కలిసి నడిచేందుకు సిద్దమైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సిపిఐ కూడా అదే దారిలో వెళుతుందా ? లేక భిన్నమైన ఆలోచనలు చేస్తుందా ? అంటే అదికూడా టీఆర్ యస్ తో కలిసి వెళ్లే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు రాజకీయపండితులు …అయితే బీజేపీతో టీఆర్ యస్ వైఖరిని బట్టి ఇది ఉంటుందనేది వారి అభిప్రాయం …

ఇప్పటికైతే టీఆర్ యస్ నిజాయతీగానే బీజేపీ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటుంది. ఇది కొనసాగుతుందా ? మధ్యలో జారుకుంటుందా ? అనే అనుమానాలు కూడా లేకపోలేదు . నిజాయితీగా బీజేపీ వ్యతిరేక పోరాటంలో టీఆర్ యస్ పాల్గొంటే లెఫ్ట్ పార్టీలతో బంధం బలపడుతుంది.అదే సందర్భంలో సిపిఎం, సిపిఐ పార్టీలకు టీఆర్ యస్ ఎన్నిసీట్లు కేటాయించే అవకాశం ఉందనేదానిపై పొత్తు ఆధారపడి ఉంటుంది . ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్న బీజేపీ దాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. అన్ని పరీక్షలను తట్టుకొని టీఆర్ యస్ నిలబడుతుందా ? లేక మిడిల్ డ్రాప్ అవుతుందా ?అనేది చూడాల్సింది ….

 

Related posts

పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్ జిత్ చన్నీ… రాహుల్ గాంధీ ప్రకటన

Drukpadam

మోదీపై స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

Drukpadam

హుజురాబాద్ ఎన్నికలకు సిపిఐ దూరం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి!

Drukpadam

Leave a Comment