ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన నేపాల్ అధ్యక్షుడు.. నెల రోజుల్లో రెండోసారి!

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన నేపాల్ అధ్యక్షుడు.. నెల రోజుల్లో రెండోసారి!

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పౌడెల్
  • నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఆసుపత్రిలో చేరిన నేపాల్ అధ్యక్షుడు
  • ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలింపు

నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న 78 ఏళ్ల పౌడెల్‌ను వాయుమార్గం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చేరడం నెల రోజుల్లో ఇది రెండోసారి. శ్వాస సరిగా అందక బాధపడుతున్న పౌడెల్‌ను మంగళవారం కాఠ్మాండూలోని త్రిభువన్ యూనివర్సిటీ బోధనాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక  చికిత్స అనంతరం నిన్న ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించి ఎయిమ్స్‌లో చేర్చారు.

అధ్యక్షుడు చాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇండియాకు తరలించినట్టు అధ్యక్షుడి మీడియా సలహాదారు కిరన్ పోఖరెల్ తెలిపారు. ఆయనతోపాటు కుమారుడు చింతన్ పౌడెల్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్టు పేర్కొన్నారు.

అధ్యక్షుడు కాఠ్మాండూ ఆసుపత్రిలో ఉండగా మంగళవారం ప్రధాని పుష్ప కుమార్ దహాల్, ఉప ప్రధాని, రక్షణ మంత్రి పూర్ణ బహదూరు ఖడ్కా, ఇతర నేతలు కలిసి పరామర్శించారు. కడుపునొప్పితో బాధపడిన అధ్యక్షుడు పౌడెల్ ఈ నెల 1న తొలిసారి ఆసుపత్రిలో చేరారు.

Related posts

ఆర్టీసీ చార్జీల పెంపు…నేరంనాదికాదు కేంద్రానిది అంటున్న రాష్ట్రం..

Drukpadam

సాయంత్రం 6 గంటల తర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండొద్దు: సీఎం చంద్రబాబు

Ram Narayana

ఏప్రిల్ 30 లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలి: సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు….

Drukpadam