Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇంతకీ పొంగులేటి చూపులెటు …జి -30 దిశగా ఆలోచన చేస్తున్నారా …?

ఇంతకీ పొంగులేటి చూపులెటు …జి -30 దిశగా ఆలోచన చేస్తున్నారా …?
-బీజేపీలోకి ఛాన్స్ లేదు …కాంగ్రెస్ లోకి డౌట్ …
-తెలంగాణ ప్రజాసమితితో వర్క్ అవుట్ అవుతుందా …?
-ప్రొఫెసర్ కోదండరాం అందుకే ఖమ్మం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారా ..?
-పార్టీ ఏది చెప్పకుండానే అభ్యర్థులను ప్రకటిస్తున్న పొంగులేటి …
-సత్తుపల్లి నుంచి పొంగులేటి అభ్యర్థిగా కొండూరి సుధాకర్
-ఇప్పటికే ఇల్లందు కోరం కనకయ్య , వైరాకు విజయాబాయి పేర్లు ప్రకటన
-పినపాక నుంచి పాయం ….భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు అశ్వారావుపేట జాలే ఆదినారాయణ ,మధిర నుంచి డాక్టర్ కోట రాంబాబు లు పొంగులేటి అభ్యర్థులు ….

ఇంతకీ పొంగులేటి చూపులెటు …ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు …తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పరిచయమున్న ప్రతివారినీ వేధిస్తున్న ప్రశ్న…ఆయన ఒక్కరే కాదు ….ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కల్సి నిర్ణయం తీసుకోనున్నారు .అయితే ఆ నిర్ణయం ఎలా ఉంటుంది. ఏ పార్టీకి వెళ్ళతారనేది ఆసక్తిగా మారింది.వారి ముందు మూడు అప్షన్లు ఉన్నాయి. వాటిలో నెంబర్ వన్ బీజేపీ …నెంబర్ టు కాంగ్రెస్ …నెంబర్ త్రీ జి – 30 అంటే గ్రూప్ అఫ్ థర్టీ అని అర్థం … అటు కాంగ్రెస్ లోగాని ఇటు బీజేపీలోగాని చేరకుండా 30 నియోజకవర్గాల్లో పోటీ పెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు వినికిడి … అయితే నిర్ణయం పై మల్లగుల్లాలు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం .. ఇందులో ఏదైతే బెటర్ అనేదానిపై కొంత కసరత్తు చేశారు . అందులో కూడా నెంబర్ టు( కాంగ్రెస్ ) వైపే తన అనుయాయులు మొగ్గు చూపినట్లు సమాచారం … అందువల్ల బీజేపీలో చేరవద్దని బలంగా ఆయనపై సహచరులనుంచి వత్తిడి ఉంది. ఆయన మాత్రం అన్ని అప్షన్లు పరిశీలిస్తున్నారు … కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన అనుయాయులు తర్వాత తెలంగాణ లో బీజేపీలో చేరితే ప్రయోజనం ఉండదనే అభిప్రాయానికి వచ్చారు . అయితే పొంగులేటికి కేంద్రంలో సముచిత స్థానం కల్పించేందుకు కూడా బీజేపీ సిద్ధపడుతున్నట్లు సమాచారం …ఇటీవల ఢిల్లీ వెళ్లిన పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ పొంగులేటి ,జూపల్లి విషయాలను బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది.

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి కూడా నేతలు పొంగులేటి ,జూపల్లిలతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం … రాహుల్ దూతలు నేరుగా పొంగులేటితో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా పొంగులేటి ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని జూన్ నెల రెండవ వారంలో తన అనుయాయులతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని పేర్కొన్నట్లు సమాచారం .

పార్టీలో చేరడమా….? లేక పార్టీ పెట్టడమా …?

పార్టీలో చేరడమా….? లేక పార్టీ పెట్టడమా …? అనేదానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అటు బీజేపీ ,ఇటు కాంగ్రెస్ పార్టీల నుంచి పొంగులేటి పై విఫరీతమైన వత్తిడి ఉందని తెలుస్తుంది. రెండువైపులా నుంచి ఆఫర్లు ఉన్నాయి. వీరితోపాటు కొన్ని జిల్లాల నుంచి మరికొందరు నేతలు కూడా వీరి వెంట నడిచే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు …

మరొక ఆలోచన కూడా చేస్తున్నట్లు వినికిడి …ప్రొఫెసర్ కోందండరాం తో కలిసి పోటీచేస్తే ఆయనకు ఉన్న ఉద్యమకారుడు ఇమేజ్ కల్సి వచ్చి లాభం జరుగుతుందని అనుకుంటున్నారు. ఇందులో సక్సెస్ రేటు ఎంత ఉంటుంది. అసలా ప్రయత్నం మంచిదేనా లేదా అనే మీమాంసలో ఉన్నారు . ఇటీవల ఖమ్మంలో పొంగులేటి ఆధ్వరంలో పెట్టిన ఆత్మీయ సమ్మేళనానికి ప్రొఫెసర్ సార్ వచ్చారు . ఆయనతో కూడా తమ మనసులోని మాటలను పొంగులేటి ,జూపల్లి పంచుకున్నారు. ఆయన కూడా బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది.

మరొక ఆలోచన కూడా పొంగులేటి అండ్ టీం చేస్తుంది. రెండు పార్టీల్లో చేరకుండా రాష్ట్రంలో 30 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ఎక్కుడ సీట్లలో గెలిచి హంగ్ వస్తే కింగ్ మేకర్లం కావచ్చుననే దిశగా మెదడుకు పదును పెడుతున్నారు. అయితే దీనివల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ రెండవ వారం వరకు ఆగాల్సిందే …

ఇప్పటికే ఇల్లందు నుంచి కోరం కనకయ్య , పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు , భద్రాచలం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు , అశ్వారావు పేట నుంచి జాలే ఆదినారాయణ , వైరా నుంచి విజయాబాయి, మధిర నుంచి డాక్టర్ కోట రాంబాబు పేర్లను ప్రకటించిన పొంగులేటి సత్తుపల్లి నుంచి రిటైర్డ్ పంచాయతీ రాజ్ ఇ ఇ కొండూరి సుధాకర్ రావు పేరు ప్రకటించారు …దీంతో ఉమ్మడి జిల్లాలో ఎస్సీ ,ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన పూర్తీ అయింది. ఇక మూడు జనరల్ సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి…

సత్తుపల్లి నుండి తెరపైకి కొత్త పేరు …కొండూరి సుధాకర్.

త్వరలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ప్రజల మద్దతు తో పోటీ చేస్తానని పంచాయతీ రాజ్ ఈ ఈ కొండూరి సుధాకర్ అన్నారు. సత్తుపల్లిలో తన మిత్రుల స్నేహితుల పరిచయ కార్యక్రమంలో పాల్గొని కొండూరు సుధాకర్ మాట్లాడుతూ, 36 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వానికి ఎంతో సేవ చేశానని అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా నిజాయితీగా మంచి సేవలు అందిస్తానని అన్నారు .గత 36సంవత్సరాల నుండి ప్రభుత్వ సర్వీసులో ఎటువంటి రీమార్క్ లేకుండాసేవచేసి , ఆరుసార్లు జిల్లా ఉత్తమ పంచాయతీరాజ్ అధికారిగా అవార్డు అందుకున్నానని అన్నారు . స్థానికుడనైనా నేను ,పదవ తరగతి పెనుబల్లి హైస్కూల్లో ఇంటర్ డిగ్రీ సత్తుపల్లి కాలేజీలో, ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసి 36 సంవత్సరాలు ప్రభుత్వ సేవలు నిర్వహి ఉన్నానని ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు కూడా నిజాయితీతో సేవను అందిస్తానని అన్నారు.మా తల్లిదండ్రులు పెనుబల్లి మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేసి ఎంతోమందిని సమాజానికి ఉపయోగపడే ఉద్యోగులుగా తీర్చిదిద్దారని అన్నారు .

Related posts

బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మళ్లీ ఏపీలో కలిపేస్తారు: కేటీఆర్!

Drukpadam

అజిత్ పవార్ అటు వైపు వెళ్లడం వెనుక శరద్ పవార్ ఆశీస్సులున్నాయి: రాజ్ థాకరే…

Drukpadam

చెప్పుతో కొట్టుకోవడం సుబ్బారాయుడికి అలవాటుగా మారింది: మంత్రి పేర్ని నాని!

Drukpadam

Leave a Comment