Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

కాబోయే సీఎం కేటీఆర్ ఖమ్మం ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్…

కాబోయే సీఎం కేటీఆర్ ఖమ్మం ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్

బీఆర్ఎస్ లో ప్రస్తుత సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారు: మంత్రి పువ్వాడ అజయ్
ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారన్న మంత్రి పువ్వాడ
కాంగ్రెస్‌, బీజేపీలకు దమ్ముంటే తమ సీఎం అభ్యర్థి పేరు చెప్పాలని డిమాండ్
ఖమ్మం నగరానికి తన అవసరం తీరిన రోజున రాజకీయాల నుంచి వైదొలుగుతానని వ్యాఖ్య…

ప్రతిపక్షాలకు సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము దైర్యం ఉందా…? అని ప్రశ్నించారు …తాము తిరిగి అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం కావడం ఖాయమనేలా ఆయన మాట్లాడారు …కాబోయే సీఎం ,ప్రస్తుత సీఎం తమ పార్టీలో ఉన్నారని ప్రతిపక్షాలకు అదిలేదని ఎద్దవా చేశారు .ఖమ్మం అభివృద్ధి నాశ్వాస ,నాజాస అందుకోసమే తనకు వచ్చిన అవకాశాన్ని నిస్వార్థం తో ఉపయోగించాను…తనకు అవకాశం ఉన్నంతకాలం ఉపయోగిస్తాను …తన అవసరం తీరిందని ఖమ్మం ప్రజలు భావించిన రోజున రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి ఉద్యేగభరితంగా అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు ….

బీఆర్ఎస్ లో ప్రస్తుత సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని, భవిష్యత్ లో ఆయనే సీఎం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి అజయ్ పాల్గొన్నారు.

ప్రతిపక్ష పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరని.. కాంగ్రెస్‌, బీజేపీలకు దమ్ముంటే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పాలని పువ్వాడ అజయ్ డిమాండ్‌ చేశారు. గొంగళి పురుగులా ఉన్న ఖమ్మం పట్టణాన్ని సీతాకోక చిలుకలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఖమ్మం నగరానికి తన అవసరం తీరిన రోజున రాజకీయాల నుంచి వైదొలుగుతానని మంత్రి చెప్పారు.

ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అనేక మంది అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి అభివృద్ధి చేశామన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి రహిత కార్పొరేషన్‌గా నిలిచిందని అన్నారు.

Related posts

శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం 2 వేల కోట్ల ఒప్పందమా …?

Drukpadam

నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత!

Ram Narayana

ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది… నా కోసం ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: కేసీఆర్

Ram Narayana

Leave a Comment