Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మోదీ పర్యటనను బహిష్కరిస్తున్న సీఎం కేసీఆర్…అధికారికంగా ప్రకటించిన …కేటీఆర్

మోదీ పర్యటనను బహిష్కరిస్తున్న సీఎం కేసీఆర్…అధికారికంగా ప్రకటించిన
…కేటీఆర్
-మోడీ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించారన్న కేటీఆర్
-రేపు తెలంగాణ పర్యటనకు వస్తున్న మోదీ
-తెలంగాణపై మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారన్న కేటీఆర్
-ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్న

ప్రధాని మోదీ రేపు తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే మోదీ పర్యటనకు కేసీఆర్ బహిష్కరిస్తున్నట్లు ఆపార్టీ వర్కింగ్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు . ఈసందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ విభన హామీలు అమలు చేయకపోగా , తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించిన మోదీ పర్యటనను సీఎం కేసీఆర్ కాకుండా మొత్తం బీఆర్ యస్ శ్రేణులు దూరంగా ఉంటున్నాయని అన్నారు . తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి మోదీ అని, ఏ మొహం పెట్టుకుని ఆయన తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు.

విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణపై మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ లోని కోచ్ ఫ్యాక్టరీకి రూ. 20 వేల కోట్లు ఇచ్చిన మోదీ… తెలంగాణకు కేవలం రూ. 521 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

మరోవైపు రేవంత్ రెడ్డిపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. గాంధీభవన్ లో గాడ్సే దూరాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆరెస్సెస్ వ్యక్తి రేవంత్ అని అన్నారు. భూదందాలు చేసే వ్యక్తులే ధరణిని వద్దంటున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్ ప్రధాని పర్యటనకు వెళ్లకపోవడంపై మిశ్రమ స్పందన వెలువడుతున్నది .బీజేపీ నేతలు కేసీఆర్ వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నారు . అనేక మంది ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు వచ్చి ప్రధానికి స్వాగతం పలికి రాష్ట్రాలకు కావాల్సిన సమస్యలపై మాట్లాడుతున్నారని కానీ కేసీఆర్ రాజకీయాలు చేయడం తప్ప మరొకటిలేదని విమర్శలు గుప్పిస్తున్నారు .

బీజేపీ ,బీఆర్ యస్ ఒక్కటే …వారి నిజస్వరూపం బయట పడుతుందనే ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు . కేసీఆర్ ఢిల్లీలో దోస్తీ , రాష్ట్రంలో కుస్తీ పడుతున్నట్లు ఆడుతున్న నాటకాలు ప్రజలు గ్రహించారని అందువల్లనే మోడీ , కేసీఆర్ అవగాహనతోనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు .

Related posts

జీవితాన్ని వదిలేసి.. మాతృభూమి నుంచి పారిపోతున్నా: అందరినీ కదిలిస్తున్న ఆఫ్ఘన్​ యువతి భావోద్వేగ పోస్ట్!

Drukpadam

ఏజెంట్ చేతిలో మోసపోయి కెనడాలో బిక్కుబిక్కుమంటున్న 700 మంది భారత విద్యార్థులు

Drukpadam

కోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి ఉద్యమానికి విరామం!

Drukpadam

Leave a Comment