Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు

అంబటి రాయుడిపై అమరావతి రైతుల ఆగ్రహం

  • తుళ్లూరు మండలం వెలగపూడికి వెళ్లిన రాయుడు
  • తమ సమస్యలను వినాలని కోరిన అమరావతి రైతులు
  • మరోసారి వచ్చినప్పుడు వింటానన్న రాయుడు

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి నిరసన సెగ తగిలింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెలగపూడికి ఈరోజు రాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు ఆయనను కలిశారు. అమరావతికి మద్దతు పలకాలని రాయుడిని కోరారు. తమ సమస్యలను వినాలని అభ్యర్థించారు. తమకు మద్దతు తెలపకపోయినా పర్వాలేదు, సమస్యలను వినాలని రైతులు కోరారు. అయితే తనకు సమయం లేదని, మీ సమస్యలను మరోసారి వింటానని చెపుతూ రాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాయుడుపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతల కోరిక మేరకు అంబటి రాయుడు అక్కడకు వెళ్లారు.

Related posts

ఖమ్మం జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం ;సీపీ విష్ణు ఎస్ వారియర్!

Drukpadam

ఆఫ్ఘన్‌ సంక్షోభం: ఐక్యరాజ్య సమితి పిలుపుతో బిలియన్ డాలర్ల సాయం!

Drukpadam

వైసీపీకి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంచి మాట ….

Drukpadam

Leave a Comment